కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి

మీ కోరికల్ని అదుపులో పెట్టుకోండి

మనం అపరిపూర్ణులం కాబట్టి కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ పోరాడుతూ ఉంటాం. ఒకవేళ వాటిని అదుపులో ఉంచుకోకపోతే యెహోవా ఆమోదాన్ని కోల్పోతాం. ఉదాహరణకు, కొంతమంది ఆహారాన్ని, బట్టల్ని, ఇంటిని దేవునికన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఇంకొంతమంది, లైంగిక కోరికల్ని తీర్చుకోవడానికి దేవుని ప్రమాణాల్ని సైతం పక్కన పెట్టేస్తారు. (రోమా 1:26, 27) ఇంకొందరు తోటివాళ్లు తమను ఇష్టపడాలి, కలుపుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ల ఒత్తిడికి లొంగిపోతారు.—నిర్గ 23:2.

మరి, మన కోరికల్ని ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? మనం యెహోవా ఇష్టపడే వాటిని చేయడం పైనే మనసుపెట్టాలి. (మత్త 4:4) అంతేకాదు, కోరికల్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాను వేడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే మనకు ఏది మంచిదో, మన కోరికల్ని ఎలా తీర్చాలో ఆయనకే తెలుసు.—కీర్త 145:16.

సిగరెట్‌ తాగి జీవితాన్ని నాశనం చేసుకోకండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • కొంతమంది ఎందుకు సిగరెట్‌ కాలుస్తారు?

  • సిగరెట్‌ కాలిస్తే మన ఆరోగ్యానికి ఏమౌతుంది?

  • సిగరెట్లు కాల్చడం, ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు తాగడం (vaping) ఎందుకు తప్పు?—2కొ 7:1

  • సిగరెట్‌ తాగాలనే కోరికను మీరు తీసేసుకోవచ్చు

    సిగరెట్‌ ముట్టుకోనని మీరెలా చెప్పవచ్చు? ఒకవేళ సిగరెట్‌ అలవాటు ఉంటే దాన్నెలా మానుకోవచ్చు?