కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి యెహోవాపై, యేసుపై విశ్వాసాన్ని పెంపొందించండి

ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! ఉపయోగించి యెహోవాపై, యేసుపై విశ్వాసాన్ని పెంపొందించండి

బైబిలు విద్యార్థులు బలమైన విశ్వాసం ఉంటేనే దేవున్ని సంతోషపెట్టగలుగుతారు. (హెబ్రీ 11:6) వాళ్లు బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే, మనం వాళ్ల హృదయాన్ని తాకేలా బోధించాలి. అలా బోధించడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకంలో ముఖ్యమైన లేఖనాలు, స్పష్టమైన వివరణ, ఆలోచింపజేసే ప్రశ్నలు, ప్రోత్సహించే వీడియోలు, అందమైన చిత్రాలు ఉన్నాయి. క్రైస్తవ లక్షణాల్ని పెంచుకునేలా, దేవునికి స్నేహితులుగా ఉండేలా మన బైబిలు విద్యార్థులకు సహాయం చేస్తే వాళ్లు అగ్నిలాంటి పరీక్షల్ని కూడా తట్టుకుంటారు.—1కొ 3:12-15.

కంటికి కనిపించని దేవునితో స్నేహం చేయడమే కొంతమందికి కొత్తగా, అసాధ్యంగా అనిపిస్తుంది. అలాంటివాళ్లకు యెహోవా లక్షణాల గురించి చెప్తూ, ఆయనపై విశ్వాసాన్ని పెంచుకునేలా సహాయం చేయాలి.

“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!”పయోగించి యెహోవాపై విశ్వాసాన్ని పెంపొందించండి! వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సహోదరి స్టడీకి బాగా సిద్ధపడిందని మనం ఎలా చెప్పవచ్చు?

  • యెషయా 41:10, 13 వచనాలపై విద్యార్థి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమె చిన్నచిన్న ప్రశ్నల్ని ఎలా చక్కగా ఉపయోగించింది?

  • ఆమె చూపించిన వీడియో వల్ల, బైబిలు వచనాల వల్ల విద్యార్థి ఎలా ప్రయోజనం పొందింది?

చాలామందికి యేసు అర్పించిన బలి ఉద్దేశం ఏంటో తెలీదు. అది వాళ్లకు దేవుడు వ్యక్తిగతంగా ఇచ్చిన బహుమానమని అర్థం చేసుకోరు. (గల 2:20) అలాంటివాళ్లకు యేసు అర్పించిన బలిపై విశ్వాసం పెరిగేలా సహాయం చేయాలి.

“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!”పయోగించి యేసుపై విశ్వాసాన్ని పెంపొందించండి! వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • సహోదరుడు స్టడీకి బాగా సిద్ధపడ్డాడని మనం ఎలా చెప్పవచ్చు?

  • విద్యార్థికి సహాయం చేయడానికి “ఇవి కూడా చూడండి” భాగంలోని సమాచారాన్ని ఆయనెలా ఉపయోగించుకున్నాడు?

  • విద్యార్థి కోసం ప్రార్థించడం ఎందుకు ముఖ్యం?