కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

“ప్రేమ . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది”

“ప్రేమ . . . అన్నిటినీ నిరీక్షిస్తుంది”

మన ప్రేమలో స్వార్థం ఉండదు కాబట్టి సహోదరులందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. (1కొ 13:4, 7) ఉదాహరణకు ఎవరైనా ఒక సహోదరుడు పాపం చేసి దానికి క్రమశిక్షణ పొందితే, ఆయన దాన్ని అంగీకరించి మారాలని ఆశిస్తాం. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాళ్ల పట్ల సహనం చూపిస్తాం, వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. (రోమా 15:1) ఒకవేళ ఎవరైనా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే, వాళ్లు ఇక రారు అనుకోకుండా, ఏదోక రోజు ఖచ్చితంగా తిరిగొస్తారని ఆశతో ఉంటాం.—లూకా 15:17, 18.

ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అన్నిటినీ నిరీక్షిస్తుంది వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • విశ్వసనీయత చూపించడానికి సంబంధించి అబ్నేరులో ఎలాంటి మార్పు వచ్చింది?

  • అబ్నేరు విన్నపానికి దావీదు ఎలా స్పందించాడు? మరి, యోవాబు ఎలా స్పందించాడు?

  • మన సహోదరుల విషయంలో అంతా మంచే జరగాలని మనం ఎందుకు ఆశించాలి?