మన క్రైస్తవ జీవితం
“ప్రేమ . . . అవినీతి విషయంలో సంతోషించదు”
నిజ క్రైస్తవులు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనక ప్రేమ ఉంటుంది. ప్రేమ “అవినీతి విషయంలో [లేదా, చెడు విషయంలో] సంతోషించదు.” (1కొ 13:4, 6, అధస్సూచి) అందుకే మనం అనైతికతను, హింసను ప్రోత్సహించే వినోదానికి దూరంగా ఉంటాం. అంతేకాదు ఎవరికైనా చెడు జరిగినప్పుడు, ఒకవేళ అది మనల్ని బాధపెట్టినవాళ్లకు జరిగిన సరే మనం సంతోషించం.—సామె 17:5.
ప్రేమ ఎలా ప్రవర్తిస్తుందో గుర్తుంచుకోండి—అవినీతి విషయంలో సంతోషించదు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
సౌలు, యోనాతాను చనిపోయారని తెలిసినప్పుడు దావీదు ఎలా స్పందించాడు?
-
సౌలు, యోనాతానుల కోసం దావీదు ఏ గీతాన్ని కూర్చాడు?
-
సౌలు చనిపోయినప్పుడు దావీదు ఎందుకు సంతోషించలేదు?