కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

దేశంలో అల్లర్లు చోటుచేసుకున్నప్పుడు ఏం చేయాలో ఆలోచించుకున్నారా?

దేశంలో అల్లర్లు చోటుచేసుకున్నప్పుడు ఏం చేయాలో ఆలోచించుకున్నారా?

ఈ వ్యవస్థ అంతానికి దగ్గరయ్యే కొద్దీ అల్లర్లు, ఉగ్రవాదం, యుద్ధాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. (ప్రక 6:4) మరి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు మనం ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? మనం రెండు విషయాల్లో సిద్ధపడవచ్చు.

  • నమ్మకంగా ఉండడానికి: యెహోవాపై, ఆయన సంస్థపై ఉన్న నమ్మకాన్ని పెంచుకోవడానికి, తటస్థంగా ఉండడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల్ని, వృత్తాంతాల్ని పరిశీలించాలి. (సామె 12:5; jr-E 125-126 పేజీలు, 23-24 పేరాలు) సహోదరసహోదరీలతో బలమైన స్నేహాన్ని ఏర్పర్చుకోవడానికి ఇదే సరైన సమయం.—1పే 4:7, 8

  • ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండడానికి: ఒక సురక్షితమైన చోటును ఎంచుకుని పెట్టుకోండి. సరుకులు సమృద్ధిగా ఉండేలా చూసుకోండి. ఇంటిని వదిలి వెళ్లే పరిస్థితి వస్తే ఎటునుండి వెళ్లాలో, ఎలా వెళ్లాలో (evacuation plan) ఆలోచించి పెట్టుకోండి. గో-బ్యాగ్‌లో అవసరమైనవి ఉన్నాయో లేదో చూసుకోండి, అందులో చేతి గ్లౌసులు, మాస్క్‌లు, శానిటైజర్లు, డబ్బు కూడా పెట్టుకోండి. సంఘపెద్దలను ఎలా సంప్రదించాలో ముందే తెలుసుకుని ఉంచుకోండి. వాళ్లు మిమ్మల్ని ఎలా సంప్రదించాలో కూడా ముందుగానే చెప్పి పెట్టండి.—యెష 32:2; g17.5-E 3-7

అల్లర్లు చెలరేగినప్పుడు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మీరు ప్రతీరోజు చేసేవాటిని ఆపకండి. (ఫిలి 1:10) అవసరమైతే తప్ప, మీరున్న చోటు నుండి బయటకు వెళ్లకండి. (మత్త 10:16) మీ దగ్గరున్న ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని తోటివాళ్లతో పంచుకోండి.—రోమా 12:13.

విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • విపత్తు సమయాల్లో యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

  • సిద్ధంగా ఉండడానికి ముందుగానే మనం ఎలాంటి పనులు చేయవచ్చు?

  • విపత్తుల వల్ల నష్టపోయినవాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?