కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

తాజాగా జరుగుతున్న పరిస్థితుల్ని ఉపయోగించి పరిచర్యలో మాట్లాడండి

తాజాగా జరుగుతున్న పరిస్థితుల్ని ఉపయోగించి పరిచర్యలో మాట్లాడండి

యేసు తన పరిచర్యలో, తాజా సంఘటనలు ఉపయోగిస్తూ ప్రజలకు బోధించాడు. (లూకా 13:1-5) మీరు కూడా ప్రజలకు రాజ్య సందేశం పట్ల ఆసక్తి కలిగించడానికి తాజా సంఘటనల్ని ఉపయోగించవచ్చు. ధరలు పెరిగిపోవడం, ప్రకృతి విపత్తు, అల్లర్లు చెలరేగడం, డ్రగ్స్‌కు బానిసలవ్వడం లేదా ఇంకేదైనా సమస్య గురించి చెప్పాక, వాళ్లను ఆలోచింపజేసే ఒక ప్రశ్న అడగండి. బహుశా మీరు ఇలా అడగవచ్చు: “(మీరు ప్రస్తావించిన సమస్యకు) ఎప్పటికైనా ముగింపు ఉంటుందని మీరు అనుకుంటున్నారా?” లేదా “(మీరు ప్రస్తావించిన సమస్యకు) ఏదైనా పరిష్కారం ఉందంటారా?” ఆ తర్వాత, మీరు మాట్లాడుతున్న అంశానికి సరిపోయే ఒక బైబిలు వచనాన్ని చూపించండి. ఇంటివ్యక్తికి ఆసక్తి ఉందనిపిస్తే ఒక వీడియో చూపించండి లేదా బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణ ఇవ్వండి. మన ప్రాంతంలో ఉన్న ప్రజల హృదయాల్ని చేరుకోవడానికి శాయశక్తులా కృషి చేద్దాం. ‘మంచివార్త కోసం చేయగలిగినవన్నీ చేద్దాం.’—1కొ 9:22, 23.

ఎలాంటి అంశాల గురించి మాట్లాడితే మీ ప్రాంతంలో ప్రజలు ఆసక్తిగా వింటారు?