మన క్రైస్తవ జీవితం
మతభ్రష్టత్వం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి
సాతాను, అతన్ని అనుసరించేవాళ్లు మన విశ్వాసాన్ని నీరుగార్చడానికి నిజాల్ని అబద్ధాలతో కలుపుతున్నారు. (2కొ 11:3) ఉదాహరణకు, యెహోవా ప్రజల ధైర్యాన్ని కూలదోయడానికి అష్షూరీయులు అర్థ సత్యాలు, పచ్చి అబద్ధాలు చెప్పారు. (2ది 32:10-15) మతభ్రష్టులు కూడా ఇప్పుడు అవే కుతంత్రాల్ని వాడుతున్నారు. మతభ్రష్టుల బోధల్ని మనం ఎలా చూడాలి? అవి విషంతో సమానం! వాటిని ఎన్నడూ చదవొద్దు, వాటికి జవాబివ్వొద్దు, లేదా వేరేవాళ్లకు చెప్పొద్దు. యెహోవా గురించి, ఆయన సంస్థ గురించి అనుమానాలు పుట్టించే సమాచారాన్ని పసిగట్టి, వాటికి దూరంగా ఉండండి!—యూదా 3, 4.
‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడండి’!—చిన్నభాగం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
-
రోమీయులు 16:17లో ఉన్న సలహాను మనం ఎలా పాటించవచ్చు?