మన క్రైస్తవ జీవితం
తేలిగ్గా సంభాషణలు మొదలుపెట్టండి
మామూలు విషయాల గురించి మాట్లాడుతూ సాక్ష్యమివ్వడం చాలామందికి నచ్చుతుంది. అది మంచి పద్ధతి కూడా. అయితే, అలా మాటలు మొదలుపెట్టాలంటే కొంతమందికి కంగారుగా అనిపించవచ్చు. దానికిగల కారణం ఏంటంటే, ఏదైనా లేఖనం చూపించాలని గానీ లేదా లేఖనాల్లోని విషయాల్ని చెప్పాలని గానీ తొందర పడుతుండవచ్చు. అలా తొందరపడకుండా అవతల వాళ్లమీద వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే మనం ప్రశాంతంగా మాట్లాడవచ్చు. (మత్త 22:39; ఫిలి 2:4) ఒకవేళ మాటల మధ్యలో అవకాశం దొరికితే, సాక్ష్యం ఇవ్వడానికి మన దగ్గర చాలా పనిముట్లు అందుబాటులో ఉన్నాయి.
దానికోసం ఈ కింది పనిముట్లు ఎలా సహాయం చేస్తాయి?
‘ఇనుము ఇనుముకు పదునుపెడుతుంది’—సంభాషణ మొదలుపెట్టడం వీడియో చూసి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి:
సంభాషణను మొదలుపెట్టే మన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఏ మూడు పనులు సహాయం చేస్తాయి?