కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

యెహోవా చూసినట్టు మిమ్మల్ని మీరు చూసుకోండి

యెహోవా చూసినట్టు మిమ్మల్ని మీరు చూసుకోండి

“యెహోవా తన ప్రజల్ని బట్టి సంతోషిస్తాడు.” (కీర్త 149:4) మనం అపరిపూర్ణులమైనా, మనలో ఉన్న మంచి లక్షణాల్ని, మనమేం చేయగలమనే దాన్ని యెహోవా చూస్తాడు. అయితే, కొన్నిసార్లు మనల్ని మనం అలా చూసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. బహుశా వేరేవాళ్లు మనతో వ్యవహరించిన విధానం బట్టి మనం ఎందుకూ పనికిరానివాళ్లమని మనకు అనిపించవచ్చు. లేదా మనం గతంలో చేసిన తప్పుల్ని బట్టి యెహోవా మనల్ని ప్రేమించట్లేదేమో అని అనిపించవచ్చు. అలాంటప్పుడు మనకు ఏది సహాయం చేస్తుంది?

మనుషులు చూడలేని దాన్ని యెహోవా చూడగలుగుతాడు అని గుర్తుపెట్టుకోండి. (1స 16:7) అంటే, మనలో మనం చూడలేని దాన్ని కూడా యెహోవా చూడగలడు. మంచి విషయం ఏంటంటే, యెహోవా మనల్ని ఎలా చూస్తాడో అర్థం చేసుకోవడానికి బైబిలు ఒక కిటికీలా పనిచేస్తుంది. మనం ఆ కిటికీ నుండి చూసినప్పుడు అంటే బైబిలు లేఖనాల్ని, అందులోని వృత్తాంతాల్ని చూసినప్పుడు యెహోవా తన ఆరాధకుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమౌతుంది.

మీ హృదయాలకు భరోసాను ఇవ్వండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఈ వీడియోలో, తండ్రీకొడుకుల ఉదాహరణనుబట్టి యెహోవా మనల్ని ఎలా చూస్తాడని అర్థమౌతుంది?

  • గతంలో ఘోరమైన పాపం చేసి, సంఘపెద్దల సహాయం తీసుకుని, యెహోవాతో తమకున్న బంధాన్ని బలపర్చుకున్నవాళ్లు తమ హృదయాలకు ఏ భరోసా ఇవ్వచ్చు?—1యో 3:19, 20

  • ఈ వీడియోలో ఉన్న బ్రదర్‌, దావీదు అలాగే యెహోషాపాతు వృత్తాంతాల్ని చదివి, ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందాడు?