మన క్రైస్తవ జీవితం
యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి”
ప్రతీ సంవత్సరం, ఎంతోమంది యౌవనులు యెహోవాకు ఫ్రెండ్స్ అవుతున్నారు. (కీర్త 110:3) యెహోవా మీలో ప్రతీ ఒక్కర్నీ పట్టించుకుంటాడు. మీరు ఎదుర్కొనే ప్రతీ కష్టం ఆయనకు తెలుసు. మీకు సహాయం చేస్తానని ఆయన మాటిస్తున్నాడు. ఒకవేళ మీరు ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగిన వాళ్లయితే, యెహోవా “తండ్రిలేనివాళ్లకు తండ్రి” అవుతాడని గుర్తుపెట్టుకోండి. (కీర్త 68:5) మీ ఇంట్లో పరిస్థితులు ఏవైనా, యెహోవా ఇచ్చే శిక్షణ తీసుకుంటే మీరు విజయం సాధిస్తారు. —1పే 5:10.
విశ్వాసం కోసం విజయవంతంగా పోరాడుతున్నవాళ్లు—సత్యంలో ఉన్న ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగినవాళ్లు వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
టామీ, ఛార్లెస్, జిమ్మీ ఉదాహరణల నుండి మీరేం నేర్చుకున్నారు?
-
ఒంటరి తల్లి లేదా తండ్రి దగ్గర పెరిగిన వాళ్లకు కీర్తన 27:10 ఏ అభయం ఇస్తుంది?