కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

ప్రపంచ పరిస్థితుల వల్ల ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు మనం షాక్‌ అవ్వం. ఎందుకు? ఎందుకంటే మనం చివరి రోజుల అంచుల్లో జీవిస్తున్నాం. అలాగే “నశించిపోయే సిరిసంపదల మీద” ఆశ పెట్టుకోవద్దని బైబిలు హెచ్చరిస్తుంది. (1తి 6:17; 2తి 3:1) మరి ఆర్థిక సంక్షోభం కోసం సిద్ధపడే విషయంలో రాజైన యెహోషాపాతు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

శత్రువులు దాడిచేయడానికి వచ్చినప్పుడు యెహోషాపాతు యెహోవావైపు చూశాడు. (2ది 20:9-12) దాంతోపాటు ఆయన కొన్ని ముందస్తు చర్యలు తీసుకున్నాడు. అవేంటంటే, ప్రాకారాలుగల నగరాల్ని కట్టడం; సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేయడం. (2ది 17:1, 2, 12, 13) యెహోషాపాతులాగే మనం కూడా యెహోవా మీద నమ్మకం ఉంచుతూ, కష్టాలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి.

విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • విపత్తు కోసం సిద్ధపడడానికి మీరేం చేయవచ్చు?

  • వేరేవాళ్లకు సహాయం చేయడానికి మనం ఎలా సిద్ధపడవచ్చు?