కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూన్‌ 17-23

కీర్తనలు 51-53

జూన్‌ 17-23

పాట 89, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. గంభీరమైన తప్పులు చేయకుండా ఉండడానికి మీరేం చేయవచ్చు?

(10 నిమి.)

అసలు తప్పులే చేయమని అనుకోకండి—మనుషులందరూ తప్పు చేయడానికి మొగ్గు చూపిస్తారు (కీర్త 51:5; 2కొ 11:3)

యెహోవాకు దగ్గర చేసే పనులు చేస్తూ ఉండండి (కీర్త 51:6; w19.01 15వ పేజీ, 4-5 పేరాలు)

అనైతిక ఆలోచనలు, కోరికలతో పోరాడండి (కీర్త 51:10-12; w15 6⁄15 14వ పేజీ, 5-6 పేరాలు)

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 52:2-4—దోయేగు చేసిన పనుల గురించి ఈ వచనాలు ఏం చెప్తున్నాయి? (it-1-E 644వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 7వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 4వ పాఠంలో 4వ పాయింట్‌)

6. మళ్లీ కలిసినప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఆ వ్యక్తికి దేవుని పేరేంటో బోధించండి. (lmd 9వ పాఠంలో 5వ పాయింట్‌)

7. శిష్యుల్ని చేసేటప్పుడు

మన క్రైస్తవ జీవితం

పాట 115

8. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవచ్చు?

(15 నిమి.) చర్చ.

మనం సరిగ్గా ఉండడానికి ఎంత ప్రయత్నించినా, తప్పులు చేస్తుంటాం. (1యో 1:8) తప్పులు చేసినప్పుడు యెహోవా క్షమాపణను పొందడాన్ని, సహాయాన్ని తీసుకోవడాన్ని అవమానంగా భావించకూడదు, భయపడకూడదు. (1యో 1:9) చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మనం చేయాల్సిన మొదటి పని యెహోవాకు ప్రార్థించడం.

కీర్తనలు 51:1, 2, 17 చదివి, ఇలా అడగండి:

  • మనం గంభీరమైన తప్పు చేస్తే, సహాయం కోసం యెహోవా వైపు తిరగాలని దావీదు మాటలు మనల్ని ఎలా ప్రోత్సహిస్తున్నాయి?

టీనేజ్‌లో నా జీవితం—నా తప్పుల్ని ఎలా సరిదిద్దుకున్నానంటే . . . వీడియో చూపించి, ఇలా అడగండి:

  • తాలిలా, హోసె తప్పుల్ని చేయడానికి నడిపించిన కొన్ని విషయాలు ఏంటి?

  • చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి వాళ్లు ఏం చేశారు?

  • అలా చేయడం వల్ల వాళ్లు ఎలా ప్రయోజనం పొందారు?

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 129, ప్రార్థన