కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 20-26

పాట 102, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. ఇతరులకు ఎందుకు సహాయం చేయాలి?

(10 నిమి.)

ఇతరులకు సహాయం చేస్తే మనం సంతోషంగా ఉంటాం (కీర్త 41:1; w18.08 22వ పేజీ, 16-18 పేరాలు)

ఇతరులకు సహాయం చేసేవాళ్లకు యెహోవా సహాయం చేస్తాడు (కీర్త 41:2-4; w15 12⁄15 24వ పేజీ, 7వ పేరా)

మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు యెహోవాకు మహిమ తీసుకొస్తాం (కీర్త 41:13; సామె 14:31; w17.09 12వ పేజీ, 17వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి,JW లైబ్రరీ యాప్‌ని ఇంకా బాగా ఉపయోగించడానికి సహాయం అవసరమైన వాళ్లు నా సంఘంలో ఎవరైనా ఉన్నారా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 40:5-10—సర్వాధిపతిగా యెహోవా స్థానాన్ని గుర్తించడం గురించి దావీదు ప్రార్థన మనకు ఏం నేర్పిస్తుంది? (it-2-E 16వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఆనందంగా కనిపించే ఒకరితో సంభాషణ మొదలుపెట్టండి. (lmd 2వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. బాధగా కనిపించిన ఒకరితో సంభాషణ మొదలుపెట్టండి. (lmd 3వ పాఠంలో 5వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

(5 నిమి.) lff 14వ పాఠంలో 6వ పాయింట్‌. “ఇవి కూడా చూడండి” సెక్షన్‌లో ఉన్న “సంఘంలో యెహోవాను స్తుతించండి” అనే ఆర్టికల్‌లో ఒక పాయింట్‌ని, మీటింగ్స్‌లో పాల్గొనడానికి వెనకాడుతున్న బైబిలు విద్యార్థితో చర్చించండి. (th 19వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 138

7. వయసు పైబడిన వాళ్లకు మంచి చేద్దాం

(15 నిమి.) చర్చ.

సంఘంలో వయసు పైబడిన నమ్మకమైన వాళ్లు చేసే సేవను యెహోవా విలువైనదిగా చూసినట్లే మనం కూడా చూడాలి. (హెబ్రీ 6:10) సంవత్సరాలుగా వాళ్లు బోధించడానికి, శిక్షణ ఇవ్వడానికి అలాగే తోటి ఆరాధకుల్ని ప్రోత్సహించడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు మీకు కూడా ఎలా సహాయం చేశారో ఆలోచించవచ్చు. వాళ్లు ఇప్పటిదాకా చేసిన సేవ పట్ల, ప్రస్తుతం చేస్తున్న సేవ పట్ల మీరెలా కృతజ్ఞత చూపించవచ్చు?

‘మన సహోదరులకు మంచి చేద్దాం’ అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • సహోదరుడు హూ-జిన్‌-కాంగ్‌ నుండి జీ-హూన్‌ ఏం నేర్చుకున్నాడు?

  • మీ సంఘంలో ఉన్న వయసు పైబడిన వాళ్లలో మీకేది బాగా నచ్చింది?

  • మంచి సమరయుడు ఉదాహరణ నుండి మనమేం నేర్చుకోవచ్చు?

  • సహోదరుడు హూ-జిన్‌-కాంగ్‌కు సహాయం చేయడానికి జీ-హూన్‌ ఇతరులను కూడా పిలవడం ఎందుకు మంచి ఐడియా అని మీకనిపిస్తుంది?

మన సంఘాల్లో ఉన్న వయసు పైబడిన వాళ్ల అవసరాల గురించి ఆలోచించినప్పుడు, వాళ్లకు సహాయం చేయడానికి మనకెన్నో అవకాశాలు దొరుకుతాయి. వాళ్లు అవసరంలో ఉన్నారని మీరు గమనిస్తే, దానిని తీర్చడానికి ఏం చేయగలరో ఆలోచించండి. —యాకో 2:15, 16.

గలతీయులు 6:10 చదవండి. ఆ తర్వాత ఇలా అడగండి:

  • సంఘంలో వయసు పైబడినవాళ్ల పట్ల ఏయే విధాలుగా ‘మంచి చేయవచ్చు?’

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 8, ప్రార్థన