కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 27–జూన్‌ 2

కీర్తనలు 42-44

మే 27–జూన్‌ 2

పాట 86, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. దైవిక విద్య నుండి పూర్తి ప్రయోజనం పొందండి

(10 నిమి.)

సాధ్యమైతే నేరుగా వచ్చి, ఇతరులతో కలిసి యెహోవాను ఆరాధించే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి (కీర్త 42:4, 5; w06 6⁄1 9వ పేజీ, 4వ పేరా)

దేవుని వాక్యాన్ని లోతుగా చదివే ముందు ప్రార్థన చేయండి (కీర్త 42:8; w12 1⁄15 15వ పేజీ, 2వ పేరా)

మీ జీవితంలో ప్రతీ విషయాన్ని బైబిలు సత్యాలు నిర్దేశించేలా అనుమతించండి (కీర్త 43:3)

దైవిక విద్య కష్టాలను ఎదుర్కొనేలా మనల్ని బలపరుస్తుంది, మన సమర్పణకు తగ్గట్టు జీవించడానికి సహాయం చేస్తుంది.—1పే 5:10; w16.09 5వ పేజీ, 11-12 పేరాలు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 44:19—‘నక్కలు నివసించే చోటు’ అనే మాటకు అర్థం ఏమైయుండొచ్చు? (it-1-E 1242వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 5వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. తర్వాతి బహిరంగ ప్రసంగానికి ఇంటి వ్యక్తిని ఆహ్వానించండి. రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి. (lmd 7వ పాఠంలో 5వ పాయింట్‌)

6. ప్రసంగం

(3 నిమి.) lmd అనుబంధం A, 4వ పాయింట్‌—అంశం: మనుషులంతా ఎప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. (th 2వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 21

7. పని గురించి, చదువు గురించి తెలివైన నిర్ణయాలు తీసుకోండి

(15 నిమి.) చర్చ.

యౌవనులారా, మీ స్కూల్‌ విద్య పూర్తయ్యాక ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? మీరు పయినీరు సేవ చేయడానికి వీలయ్యేలా ఒక ఉద్యోగం చేయాలని ఇప్పటికే అనుకోవచ్చు. లేదా అలాంటి ఉద్యోగం సంపాదించడానికి ఉపయోగపడే నైపుణ్యం, సర్టిఫికేట్‌ లేదా డిప్లొమా కోర్సు చేయడం గురించి ఆలోచిస్తుండవచ్చు. ఇది మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సమయం! అయినా, మీరేం ఎంచుకోవాలి అనే విషయంలో కంగారు పడుతుండవచ్చు; లేదా ఇతరుల్ని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవాలనే ఒత్తిడి పడుతుండవచ్చు. అలాంటప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది?

మత్తయి 6:32, 33 చదవండి. ఆ తర్వాత ఇలా అడగండి:

  • పని అలాగే చదువు గురించి ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆధ్యాత్మిక లక్ష్యాలు మనసులో ఉంచుకోవడం ఎందుకు మంచిది?

  • మత్తయి 6:32, 33 లో విషయాన్ని పాటించేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయొచ్చు?—కీర్త 78:4-7

నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థికంగా స్థిరపడాలనే కోరిక, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే కోరిక మీ మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తపడండి. (1యో 2: 15, 17) ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బు ఉంటే, అతను రాజ్య సందేశాన్ని అంగీకరించడం కష్టం అవ్వవచ్చు అని గుర్తుపెట్టుకోండి. (లూకా 18:24-27) వస్తుసంపదల్ని సంపాదించడానికి ప్రాకులాడే వ్యక్తి, బలమైన విశ్వాసాన్ని పెంచుకోలేడు అలాగే యెహోవాను సంతోషపెట్టలేడు. —మత్త 6:24; మార్కు 8:36.

నశించిపోయే వాటిని నమ్మకుండా జాగ్రత్తపడండి!—ఆస్తిపాస్తులు అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  •   మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సామెతలు 23:4, 5 ఎలా సహాయం చేస్తుంది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 47, ప్రార్థన