కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 6-12

పాట 87, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “చెడ్డవాళ్లను చూసి బాధపడకు”

(10 నిమి.)

చెడ్డవాళ్ల వల్ల మనకు నొప్పి, బాధ కలుగుతుంది (కీర్త 36:1-4; w17.04 10వ పేజీ, 4వ పేరా)

“చెడ్డవాళ్ల” మీద కోపం పెంచుకుంటే మనకే హాని కలుగుతుంది (కీర్త 37:1, 7, 8; w22.06 10వ పేజీ, 10వ పేరా)

యెహోవా వాగ్దానాల మీద నమ్మకం ఉంచితే మనకు శాంతి ఉంటుంది (కీర్త 37:10, 11; w03 12⁄1 13వ పేజీ, 20వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను వార్తల్లో వచ్చే చెడు విషయాల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 36:6—యెహోవా నీతి “గొప్ప పర్వతాల్లా” [లేదా, “దేవుని పర్వతాల్లా,” అధస్సూచి] ఉందని కీర్తనకర్త అన్న మాటలకు అర్థం ఏమై ఉండొచ్చు? (it-2-E 445వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) ఇంటింటి పరిచర్య. (lmd 1వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. గతంలో బైబిలు స్టడీ వద్దని చెప్పిన వ్యక్తికి మళ్లీ దాని గురించి చెప్పండి. (lmd 9వ పాఠంలో 4వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) ijwbv 45—అంశం: కీర్తన 37:4 కు ఉన్న అర్థం ఏంటి? (th 13వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 33

7. మీరు ‘కష్ట కాలాలకు’ సిద్ధంగా ఉన్నారా?

(15 నిమి.) చర్చ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదర సహోదరీలు ప్రకృతి విపత్తుల వల్ల, మనుషులు చేసే పనుల వల్ల వచ్చే విపత్తుల కారణంగా ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. (కీర్త 9:9, 10) విచారకరంగా, ‘కష్ట కాలాలు’ ఏ సమయంలో అయినా మనకు ఎదురవ్వొచ్చు. కాబట్టి అలాంటి వాటికి మనం సిద్ధంగా ఉండాలి.

భౌతికంగా సిద్ధపడడంతో పాటు a ఏదైనా విపత్తు వస్తే దాన్ని తట్టుకోవడానికి ఇంకేం సహాయం చేస్తుంది?

  • మానసికంగా సిద్ధపడండి: విపత్తులు ఎప్పుడైనా రావొచ్చని గుర్తించండి. ఒకవేళ వస్తే ఏం చేయాలో ముందే ఆలోచించుకోండి. మీ దగ్గరున్న వస్తువుల మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకండి. అలా చేయడం వల్ల విపత్తు వచ్చినప్పుడు మీ భద్రతకు, ప్రాణాలకు మొదటి స్థానం ఇస్తూ వెంటనే తెలివైన నిర్ణయం తీసుకోగల్గుతారు. (ఆది 19:16; కీర్త 36:9) విపత్తు సమయంలో మీరేం పోగొట్టుకున్నా ఎక్కువ ఆందోళన పడకుండా, మీ పరిస్థితి గురించి సరిగ్గా ఆలోచించడానికి కూడా అది సహాయం చేస్తుంది.—కీర్త 37:19

  • ఆధ్యాత్మికంగా సిద్ధపడండి: మీ మీద శ్రద్ధ చూపించాలనే కోరిక, సామర్థ్యం యెహోవాకు ఉందనే మీ నమ్మకాన్ని పెంచుకోండి. (కీర్త 37:18) విపత్తు సమయంలో ఒకవేళ మన ‘ప్రాణాల్ని దోపుడుసొమ్ముగా’ దక్కించుకున్నా, తన సేవకులకు కావాల్సిన నిర్దేశాన్ని, మద్దతుని యెహోవా ఇస్తాడని విపత్తు రాకముందే గుర్తుచేసుకుంటూ ఉండండి. —యిర్మీ 45:5; కీర్త 37:23, 24

యెహోవా మాటిచ్చినవన్నీ తప్పకుండా జరుగుతాయని మనం నమ్మినప్పుడు, ‘కష్ట సమయంలో ఆయన్ని కోటగా’ చేసుకుంటాం.—కీర్త 37:39.

విపత్తును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అనే వీడియో చూపించి, ఈ ప్రశ్నలు అడగండి:

  • విపత్తులు వచ్చినప్పుడు యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?

  • సిద్ధంగా ఉండడానికి మనం ముందుగానే ఎలాంటి పనులు చేయవచ్చు?

  • విపత్తుల వల్ల నష్టపోయిన వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 57, ప్రార్థన