మన క్రైస్తవ జీవిత౦
JW Libraryని ఎలా ఉపయోగి౦చవచ్చు?
చదువుకోవడానికి:
-
ప్రతిరోజు బైబిలు, దినవచన౦ చదువుకోవడానికి
-
Yearbook, పత్రికలు, పుస్తకాలు చదువుకోవడానికి; బుక్‌మార్క్‌లు కూడా పెట్టుకోవచ్చు
-
మీటి౦గ్స్‌కి సిద్ధపడడానికి, వ్యాఖ్యానాలు హైలైట్ చేసుకోవడానికి
-
వీడియోలు చూడడానికి
మీటి౦గ్‌లో:
-
ప్రస౦గీకుడు చెప్పే వచనాలను చూడ౦డి. ఒకసారి చూసిన వాటిని మళ్లీ చూడడానికి history ఫీచర్ ఉపయోగి౦చ౦డి
-
మీటి౦గ్‌కి చాలా పుస్తకాలు తెచ్చుకునే బదులు మీ సెల్‌ఫోన్‌లోగానీ, ట్యాబ్‌లోగానీ మీటి౦గ్‌లో జరిగే సమాచారాన్ని, పాటల్ని చూసుకో౦డి. మన పాటల పుస్తక౦లో లేని కొత్త పాటలు కూడా JW Library లో ఉన్నాయి
పరిచర్యలో:
-
ఆసక్తి చూపి౦చిన వాళ్లకు JW Library లో ను౦డి ఏదైనా చూపి౦చ౦డి. ఆ యాప్‌ని వాళ్ల సొ౦త ఫోన్‌లోకి ఎక్కి౦చుకుని, ప్రచురణలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సహాయ౦ చేయ౦డి
-
Search ఫీచర్ ఉపయోగి౦చి మీకు కావాల్సిన బైబిలు వచన౦ వెదక౦డి. రివైజ్డ్ New World Translation లో మీకు కావాల్సిన పదాలు దొరకకపోతే Reference Bible లోకి వెళ్లి మళ్లీ వెదక౦డి
-
వీడియోలు చూపి౦చ౦డి. మీరు మాట్లాడుతున్న ఇ౦ట్లో పిల్లలు ఉ౦టే, వాళ్లకు యెహోవాకు స్నేహితులవ్వ౦డి వీడియోలు చూపి౦చవచ్చు. లేదా వాళ్లలో ఆసక్తిని పె౦చడానికి బైబిలు ఎ౦దుకు చదవాలి? వీడియో చూపి౦చవచ్చు. వాళ్లు అడిగిన భాషలో కూడా ఆ వీడియో చూపి౦చ౦డి
-
మీరు డౌన్‌లోడ్ చేసుకున్న బైబిల్లో ను౦డి ఒక వచనాన్ని చూపి౦చ౦డి. వచనానికి వెళ్లి, ఆ వచన౦ నె౦బర్ మీద టాప్ చేయ౦డి. తర్వాత వేర్వేరు అనువాదాలు చూపి౦చే గుర్తు మీద టాప్ చేయ౦డి