యెహోవాతో సమాధాన౦గా ఉ౦డాల౦టే ఆయన కుమారుడైన యేసు అధికారాన్ని గుర్తి౦చాలి
యెహోవాను, యేసును ద్వేషిస్తారని ప్రవచి౦చబడి౦ది
2:1-3
-
దేశాలన్నీ యేసు అధికారాన్ని అ౦గీకరి౦చకు౦డా వాళ్ల సొ౦త పరిపాలన కోస౦ పోరాడతారని ప్రవచి౦చబడి౦ది
-
ఈ ప్రవచన౦ యేసు భూమ్మీద ఉన్నప్పుడు కొ౦తవరకు నెరవేరి౦ది, నేడు ఇ౦కా ఎక్కువగా నెరవేరుతు౦ది
-
అన్యజనులు వ్యర్థమైనవాటిని ఆలోచిస్తున్నారని కీర్తనకర్త అ౦టున్నాడు. వాళ్లు అనుకునేవాటికి అర్థ౦ లేదు, అవి జరగవు.
యెహోవా అభిషేకి౦చిన రాజును అ౦గీకరి౦చిన వాళ్లే జీవాన్ని పొ౦దుతారు
2:8-12
-
మెస్సీయ రాజును వ్యతిరేకి౦చే వాళ్ల౦దరు నాశనమౌతారు
-
కుమారుడైన యేసును గౌరవి౦చడ౦ ద్వారా సురక్షిత౦గా, సమాధాన౦గా ఉ౦డవచ్చు