చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
తోటి సహోదరసహోదరీల సహాయం తీసుకోండి
యెహోవా మనకు సహాయంగా “ప్రపంచవ్యాప్తంగా ఉన్న” సహోదరసహోదరీలను ఇచ్చాడు. (1పే 5:9) పరిచర్యలో మనకు ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడానికి వాళ్లు సహాయం చేస్తారు. ఉదాహరణకు అకుల-ప్రిస్కిల్ల, సీల, తిమోతి అలాగే ఇతరులు సహాయం చేయడం వల్ల అపొస్తలుడైన పౌలు ప్రయోజనం పొందాడు.—అపొ 18:1-5.
పరిచర్యలో మీ తోటి సహోదరసహోదరీలు మీకెలా సహాయం చేయగలరు? పరిచర్యలో ఎదురయ్యే అభ్యంతరాలకు జవాబివ్వడానికి, పునర్దర్శనాలు చేయడానికి లేదా బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి, దాన్ని చేయడానికి వాళ్లు మీకు ఉపయోగపడే సలహాలు ఇవ్వొచ్చు. సంఘంలో మీకు ఎవరు సహాయం చేయగలరో ఆలోచించి, వాళ్లను సహాయం అడగండి. అలా మీరు, మీకు సహాయం చేసినవాళ్లు ప్రయోజనాన్ని, సంతోషాన్ని పొందుతారు.—ఫిలి 1:25.
శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—మన సహోదరులు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
సంఘ కూటాలకు హాజరయ్యేలా జాస్మిన్‌ని నీతా ఎలా ప్రోత్సహించింది?
-
మన బైబిలు అధ్యయనాలకు తోటి ప్రచారకుల్ని ఎందుకు ఆహ్వానించాలి?
-
జాస్మిన్, అబీగేల్ ఇద్దరికీ ఏ అభిరుచి ఉంది?
-
పరిచర్యకు సంబంధించిన ఏ నైపుణ్యాలను తోటి సహోదరసహోదరీలు మీకు నేర్పించవచ్చు?