మన క్రైస్తవ జీవితం
ఎల్లప్పుడూ యెహోవాను మనసులో పెట్టుకోండి
మనం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకనప్పుడు, దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇవ్వడం కష్టం అవ్వొచ్చు. అలాంటప్పుడు యెహోవా సేవ చేయడానికి ఆటంకంగా ఉండే లేదా బైబిలు సూత్రాలకు విరుద్ధంగా ఉండే ఉద్యోగాన్ని ఒప్పుకోవాలని మనకు అనిపించవచ్చు. కానీ, “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున” యెహోవా తన బలం చూపిస్తాడనే నమ్మకంతో మనం ఉంచవచ్చు. (2ది 16:9) మన ప్రేమగల తండ్రి మనకు సహాయం చేస్తాడు, మనకు అవసరమైనది ఇస్తాడు. అలా చేయకుండా ఆయన్ని ఏదీ ఆపలేదు. (రోమా 8:32) కాబట్టి ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు యెహోవాపై నమ్మకం ఉంచుతూ, మన జీవితంలో ఎల్లప్పుడూ ఆయన సేవకు మొదటిస్థానం ఇవ్వాలి.—కీర్త 16:8.
యెహోవా కోసం మనస్ఫూర్తిగా చేయండి వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
జేసన్ ఎందుకు లంచం తీసుకోలేదు?
-
కొలొస్సయులు 3:23 ను మనం ఎలా అన్వయించుకోవచ్చు?
-
జేసన్ ఉంచిన మంచి ఆదర్శం థామస్ మీద ఎలాంటి ప్రభవం చూపించింది?
-
మత్తయి 6:22 ను మనం ఎలా అన్వయించుకోవచ్చు?