కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇస్తూ ఉండండి

మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇస్తూ ఉండండి

ఒక నైపుణ్యంగల క్రీడాకారుడు ఎప్పుడూ తన కండరాలకు శిక్షణ ఇచ్చుకుంటాడు. అదేవిధంగా, మన వివేచనా సామర్థ్యాలకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి. (హెబ్రీ 5:14) ఇతరులు తీసుకున్నలాంటి నిర్ణయాల్నే తీసుకోవాలని మనకు అనిపించవచ్చు, కానీ మనం సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే, మనం తీసుకునే నిర్ణయాలకు మనలో ప్రతీ ఒక్కరం లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.—రోమా 14:12.

బాప్తిస్మం తీసుకొని ఎక్కువ సంవత్సరాలైంది కాబట్టి మనం మంచి నిర్ణయాలే తీసుకుంటామని అనుకోకూడదు. మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే యెహోవాపై, ఆయన వాక్యంపై, ఆయన సంస్థపై పూర్తిగా ఆధారపడాలి.—యెహో 1:7, 8; సామె 3:5, 6; మత్త 24:45.

మంచి మనస్సాక్షిని కాపాడుకోండివీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ఎమ్మా ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?

  • మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో మనమెందుకు సొంత అభిప్రాయాల్ని చెప్పకూడదు?

  • ఒక జంట ఎమ్మాకు ఏ తెలివైన సలహా ఇచ్చారు?

  • తన పరిస్థితికి ఉపయోగపడే సమాచారం ఎమ్మాకు ఎక్కడ దొరికింది?