శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించండి
మనం నైపుణ్యంగా బోధించడానికి యెహోవా మనకు పనిముట్లను ఇస్తున్నాడు. వాటిలో మన ముఖ్యమైన పనిముట్టు బైబిలుతో సహా వీడియోలు, కరపత్రాలు, పత్రికలు, బ్రోషుర్లు, పుస్తకాలు వంటివి ఉన్నాయి. (2తి 3:16) ఇతరులకు లేఖనాల్ని వివరించడానికి ఆయన మనకు పరిశోధనా పనిముట్లను కూడా ఇస్తున్నాడు. వాటిలో కావలికోట లైబ్రరీ, JW లైబ్రరీ యాప్, కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీ , యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం ఉన్నాయి.
మీకు అందుబాటులో ఉన్న పనిముట్లన్నిటినీ ఉపయోగించి బైబిల్ని లోతుగా పరిశోధించినప్పుడు మీరు ఆనందాన్ని పొందుతారు. ఈ పనిముట్లను ఎలా ఉపయోగించాలో మీ బైబిలు విద్యార్థులకు తప్పకుండా శిక్షణ ఇవ్వండి. అప్పుడు బైబిలు గురించి వాళ్లకొచ్చే ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని, వాళ్లు కూడా సంతోషిస్తారు.
శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి—యెహోవా సహాయం తీసుకోండి—పరిశోధనా పనిముట్లు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:
-
సృష్టి ఎలా వచ్చిందనే దానిగురించి జాస్మిన్ ఎలాంటి అభిప్రాయం కలిగివుంది?
-
సృష్టి గురించిన సమాచారం నీతాకు ఎక్కడ దొరికింది?
-
జాస్మిన్‌కు సరిగ్గా ఉపయోగపడే సమాచారాన్ని నీతా ఎలా ఎంచుకుంది?
-
మన పరిశోధనా పనిముట్లను ఉపయోగించడం వల్ల నీతాకు ఎలా అనిపించింది?