కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి

ఆర్థిక సమస్యలున్నా ధైర్యంగా ఉండండి

ఈ చివరి రోజుల్లో జీవితమంతా కష్టాలే. చివరి రోజులు ముగింపుకు వచ్చేకొద్దీ మన కష్టాలు ఇంకా ఎక్కువౌతాయి. ఆర్థికంగాను, వస్తుపరంగాను ఏదోక విషయంలో మనకు కొరత ఏర్పడవచ్చు. (హబ 3:16-18) ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనమెలా ధైర్యంగా ఉండవచ్చు? మన దేవుడైన యెహోవా మీద ఉన్న నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. తన సేవకుల అవసరాల్ని తీరుస్తానని యెహోవా మాటిచ్చాడు. పరిస్థితులు ఎలావున్నా ఆయన మన అవసరాల్ని ఖచ్చితంగా తీర్చగలడు.—కీర్త 37:18, 19; హెబ్రీ. 13:5, 6.

మీరేం చేయవచ్చు?

  • సరైన దారి చూపించమని, తెలివిని ఇవ్వమని, సహాయం చేయమని యెహోవాను వేడుకోండి.—కీర్త 62:8.

  • ముందెప్పుడూ చేయని పని దొరికినా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండండి.—g 1⁄10 8-9, బాక్సులు

  • యెహోవాతో మీ బంధాన్ని బలపర్చే పనులు చేస్తూ ఉండండి. ఉదాహరణకు ప్రతీరోజు బైబిలు చదవండి, అన్నీ కూటాలకు హాజరవండి, మంచివార్త ప్రకటించండి

ఎప్పటికీ నిలిచివుండే ఇంటిని నిర్మించుకోండి—“ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి” వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • కొన్ని కుటుంబాలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాయి?

  • జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి?

  • ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?