మన క్రైస్తవ జీవితం
ఎవరైనా ఏడిపిస్తే యెహోవావైపు చూడండి
ఏడిపించేవాళ్లు మన ఒంటికే కాదు, మనసుకు కూడా గాయం చేయవచ్చు. అంతేకాదు, యెహోవాను ఆరాధించవద్దని బెదిరించినప్పుడు మనం భయపడితే, ఆయనతో మనకున్న స్నేహం కూడా పాడవ్వవచ్చు. ఇంతకీ, ఏడిపించేవాళ్ల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు?
ఎవరైనా ఏడిపించినప్పుడు చాలామంది దేవుని సేవకులు యెహోవావైపు చూశారు. (కీర్త 18:17) ఉదాహరణకు, హామాను కుయుక్తిగా పన్నిన పన్నాగాల గురించి ఎస్తేరు, రాజుకు ధైర్యంగా చెప్పింది. (ఎస్తే 7:1-6) అలా చేసే ముందు, ఆమె ఉపవాసం ఉండి యెహోవా మీద ఆధారపడింది. (ఎస్తే 4:14-16) ఆమె చేసిన వాటిని యెహోవా దీవించి ఆమెను, ఆమె ప్రజల్ని కాపాడాడు.
యౌవనులారా, మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే యెహోవావైపు చూడండి. తర్వాత, మీ కన్నా పెద్దవాళ్లతో మాట్లాడండి. అంటే, మీ ప్రాబ్లమ్ గురించి మమ్మీడాడీతో మాట్లాడవచ్చు. యెహోవా ఎస్తేరుకు సహాయం చేసినట్టే మీకూ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వీటితోపాటు ఇంకా ఏం చేయవచ్చు?
టీనేజ్లో నా జీవితం—ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఏం చేయాలి? వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ఛార్లీ, ఫెరిన్ నుండి యౌవనులు ఏం నేర్చుకోవచ్చు?
-
ఏడిపించేవాళ్ల నుండి పిల్లల్ని కాపాడడానికి ఛార్లీ, ఫెరిన్ చెప్పిన మాటలు అమ్మానాన్నలకు ఎలా సహాయం చేస్తాయి?