కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అక్టోబరు 28–నవంబరు 3

కీర్తనలు 103-104

అక్టోబరు 28–నవంబరు 3

పాట 30, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. “మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు”

(10 నిమి.)

కనికరం వల్ల యెహోవా సహేతుకత చూపిస్తాడు అంటే తన మాటే నెగ్గాలని పట్టుబట్టడు (కీర్త 103:8; w23.07 21వ పేజీ, 5వ పేరా)

మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన మనమీద ఆశ వదులుకోడు (కీర్త 103:9, 10; w23.09 6వ పేజీ, 16-18 పేరాలు)

మనం చేయగలిగే దానికన్నా ఆయన ఎక్కువ ఆశించడు (కీర్త 103:14; w23.05 26వ పేజీ, 2వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను నా భార్య లేదా భర్త మీద యెహోవాలానే సహేతుకత చూపిస్తున్నానా?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 104:24—కొత్తవి, విభిన్నమైనవి సృష్టించే విషయంలో యెహోవాకున్న శక్తి గురించి ఈ లేఖనం ఏం చెప్తుంది? (cl 55వ పేజీ, 18వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) బహిరంగ సాక్ష్యం. (lmd 3వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీకి ఒప్పుకున్న వ్యక్తితో బైబిలు స్టడీకి స్వాగతం అనే వీడియో గురించి చర్చించండి. (th 9వ అధ్యాయం)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A 6వ పాయింట్‌—అంశం: భర్త “తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి.” (th 1వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 44

7. మీకు మీ పరిమితులు ఏంటో తెలుసా?

(15 నిమి.) చర్చ.

యెహోవాకు మన బెస్ట్‌ ఇచ్చినప్పుడు ఆయన సంతోషిస్తాడు, మనం కూడా సంతోషిస్తాం. (కీర్త 73:28) అయితే, మన పరిమితుల్ని తెలుసుకోకుండా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అనవసరమైన ఆందోళన, నిరాశ మిగులుతాయి.

మనం చేయగలిగిన వాటిమీదే మనసుపెడితే ఇంకా ఎక్కువ చేయవచ్చు అనే వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • యెహోవా మన నుండి ఏం కోరుతున్నాడు? (మీకా 6:8)

  • తన లక్ష్యాన్ని చేరుకునే విషయంలో ఆందోళనను తగ్గించుకోవడానికి యౌవన సహోదరికి ఏం సహాయం చేసింది?

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 55, ప్రార్థన