కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 16-22

కీర్తనలు 85-87

సెప్టెంబరు 16-22

పాట 41, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. సహించడానికి ప్రార్థన సహాయం చేస్తుంది

(10 నిమి.)

మీకు సంతోషాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి (కీర్త 86:4)

మీరు నమ్మకంగా ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడగండి (కీర్త 86:11, 12; w12 5/15 25వ పేజీ, 10వ పేరా)

మీ ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడనే భరోసాతో ఉండండి (కీర్త 86:6, 7; w23.05 13వ పేజీ, 17-18 పేరాలు)


ఇలా ప్రశ్నించుకోండి, ‘కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎక్కువసేపు, ఎక్కువసార్లు ప్రార్థన చేస్తున్నానా?’—కీర్త 86:3.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 86:11—మనిషి హృదయం గురించి దావీదు చేసిన ప్రార్థన నుండి మనకు ఏం అర్థమౌతుంది? (it-1-E 1058వ పేజీ, 5వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 3వ పాఠంలో 5వ పాయింట్‌)

5. మళ్లీ కలిసినప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. అంతకుముందు మాట్లాడినప్పుడు వార్తల్లో చెప్పిన ఒక సంఘటనవల్ల ఆందోళనపడిన వ్యక్తికి ఈసారి బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 7వ పాఠంలో 4వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేస్తున్నప్పుడు

(5 నిమి.) lff 15వ పాఠంలో 5వ పాయింట్‌. వచ్చేవారం మీరు లేని సమయంలో, స్టడీ కోసం చేసిన ఏర్పాట్ల గురించి మీ బైబిలు విద్యార్థికి చెప్పండి. (lmd 10వ పాఠంలో 4వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 83

7. ప్రీచింగ్‌ ఆపకుండా చేయండి

(5 నిమి.) చర్చ.

వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • ప్రీచింగ్‌ ఆపేయాలని కొన్నిసార్లు మనకు ఎందుకు అనిపించవచ్చు?

  • అయినా మనం ఎందుకు ఆపకుండా ప్రీచింగ్‌ చేస్తూనే ఉండాలి?

8. బైబిలు స్టడీలను మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి!

(10 నిమి.) చర్చ.

ఈ నెల ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురును ఉపయోగించి మీరు బైబిలు స్టడీ మొదలుపెట్టగలిగారా? అలా అయితే, మీకు చాలా సంతోషంగా అనిపించి ఉంటుంది. మీకు వచ్చిన ఫలితాలను బట్టి ఇతరులు కూడా ప్రోత్సాహాన్ని పొంది ఉంటారు. కానీ ఒకవేళ మీకు బైబిలు స్టడీ దొరకకపోతే, మీ ప్రయాస వృథా అయిపోయినట్టు మీకు అనిపించవచ్చు. మీకు నిరుత్సాహంగా అనిపిస్తే ఏం చేయవచ్చు?

మేం ఓర్పు చూపిస్తూ, “మమ్మల్ని మేము దేవుని పరిచారకులుగా సిఫారసు చేసుకుంటున్నాం”—పరిచర్య చేస్తున్నప్పుడు అనే వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి:

  • పరిచర్యలో మనం చేసే ప్రయత్నాలు “గాలిలో కలిసిపోతున్నట్టు” ఎప్పుడైనా అనిపిస్తే 2 కొరింథీయులు 6:4, 6 వచనాలు మనకెలా సహాయం చేస్తాయి?

  • బైబిలు స్టడీ మొదలుపెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు వృథా అని మీకు అనిపిస్తే ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు?

మనం ఎన్ని బైబిలు స్టడీలు మొదలుపెట్టామో, ఎన్ని బైబిలు స్టడీలు చేస్తున్నామో అనే దాన్నిబట్టి కాదుగానీ మన ప్రయత్నాలను చూసి యెహోవా ఆనందిస్తున్నాడనే దాన్నిబట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. (లూకా 10:17-20) కాబట్టి, “ప్రభువు సేవలో మీరు పడే కష్టం వృథా కాదని గుర్తుంచుకొని” ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనండి!—1కొ 15:58.

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 39, ప్రార్థన