కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 2-8

కీర్తనలు 79-81

సెప్టెంబరు 2-8

పాట 29, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. యెహోవా మహిమగల పేరును ప్రేమించండి

(10 నిమి.)

యెహోవా పేరుకు మచ్చ తెచ్చే పనులకు దూరంగా ఉండండి (కీర్త 79:9; w17.02 9వ పేజీ, 5వ పేరా)

యెహోవా పేరున ప్రార్థించండి (కీర్త 80:18; ijwbv 3, 4-5 పేరాలు)

తన మాట వింటూ తన పేరును ప్రేమిస్తున్నామని చూపించేవాళ్లను యెహోవా మెండుగా దీవిస్తాడు (కీర్త 81:13, 16)

మన ప్రవర్తన ద్వారా యెహోవా పేరుకు మహిమను తీసుకురావాలంటే, మనం యెహోవాసాక్షులమని అందరికీ చెప్పాలి

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 80:1—కొన్నిసార్లు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి గురించి చెప్పడానికి యోసేపు పేరును ఎందుకు ఉపయోగించేవాళ్లు? (it-2-E 111వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(1 నిమి.) ఇంటింటి పరిచర్య. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 4వ పాఠంలో 4వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 4వ పాఠంలో 3వ పాయింట్‌)

6. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) బహిరంగ సాక్ష్యం. బైబిలు స్టడీ గురించి చెప్పండి. (lmd 3వ పాఠంలో 3వ పాయింట్‌)

7. మళ్లీ కలిసినప్పుడు

(5 నిమి.) ఇంటింటి పరిచర్య. గతంలో బైబిలు స్టడీ వద్దని చెప్పిన ఒక ఆసక్తిపరునికి బైబిలు స్టడీ గురించి మళ్లీ చెప్పండి. (lmd 8వ పాఠంలో 3వ పాయింట్‌)

మన క్రైస్తవ జీవితం

పాట 10

8. “వాళ్లు నా పేరును పవిత్రపరుస్తారు”

(15 నిమి.) చర్చ.

సాతాను ఏదెను తోటలో యెహోవా పేరు మీద నిందలు వేయడం మొదలుపెట్టాడు. అప్పటినుండి యెహోవా పేరును గౌరవించాలా వద్దా అనే ప్రాముఖ్యమైన నిర్ణయం దేవదూతలు, మనుషుల ముందు ఉంది.

యెహోవా గురించి సాతాను వ్యాపిస్తున్న కొన్ని పచ్చి అబద్ధాల్ని గమనించండి. యెహోవా కఠినుడని, ప్రేమలేని పరిపాలకుడని నిందిస్తున్నాడు. (ఆది 3:1-6; యోబు 4:18, 19) యెహోవా ఆరాధకులు ఆయన్ని స్వార్థంతోనే ప్రేమిస్తున్నారని చెప్తున్నాడు. (యోబు 2:4, 5) మన చుట్టూ ఉన్న అందమైన భూమిని యెహోవా సృష్టించలేదని నమ్మేలా కూడా సాతాను లక్షలమందిని మభ్యపెడుతున్నాడు.—రోమా 1:20, 21.

అలాంటి అబద్ధాలు విన్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? వెంటనే నిలబడి యెహోవా తరఫున మాట్లాడాలి అనిపిస్తుంది కదా! తన పేరును పవిత్రపర్చడానికి తన ప్రజలు ముందుకొస్తారని యెహోవాకు తెలుసు. (యెషయా 29:23 తో పోల్చండి.) మీరు ఏం చేయవచ్చు?

  • యెహోవా గురించి తెలుసుకునేలా, ఆయన్ని ప్రేమించేలా ఇతరులకు సహాయం చేయండి. (యోహా 17:25, 26) ఆయన నిజంగా ఉన్నాడని నిరూపించే ఆధారాలను చూపించడానికి, ఆయనకున్న అద్భుతమైన లక్షణాల్ని బోధించడానికి సిద్ధంగా ఉండండి.—యెష 63:7

  • మీ నిండు హృదయంతో యెహోవాను ప్రేమించండి. (మత్త 22:37, 38) యెహోవా ఆజ్ఞలకు లోబడండి. అవి మనకు మంచి చేస్తాయనే ఉద్దేశంతోనే కాదుగానీ యెహోవాను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో అలా చేయండి.—సామె 27:11

చెక్కుచెదరని ప్రేమ చూపిస్తూ ఉండండి . . . స్కూల్లో చెడు పరిస్థితులు ఉన్నా అనే వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి:

  • ఏరియల్‌, డీగో యెహోవా పేరును ఎలా సమర్థించారు?

  • యెహోవా తరఫున మాట్లాడడానికి వాళ్లను ఏది కదిలించింది?

  • మీరు వాళ్లలా ఎలా ఉండవచ్చు?

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 90, ప్రార్థన