కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 30–అక్టోబరు 6

కీర్తనలు 90-91

సెప్టెంబరు 30–అక్టోబరు 6

పాట 140, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. మీ ఆయుష్షును పెంచుకోవాలంటే యెహోవా మీద నమ్మకం ఉంచండి

(10 నిమి.)

మనుషులుగా మన ఆయుష్షును ఉన్నదాని కన్నా ఎక్కువ పొడిగించుకోలేం (కీర్త 90:10; wp19.3 5వ పేజీ, 2-4 పేరాలు)

యెహోవా “శాశ్వతకాలం నుండి శాశ్వతకాలం వరకు” ఉంటాడు (కీర్త 90:2, అధస్సూచి; wp19.1 5వ పేజీ, బాక్సు)

తన మీద నమ్మకం ఉంచేవాళ్లకు ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వగలడు, ఇస్తాడు కూడా (కీర్త 21:4; 91:16)

యెహోవా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న వైద్య చికిత్సను తీసుకుని తనతో మీకున్న బంధాన్ని ఎన్నడూ తెంచుకోకండి.—w22.06 18వ పేజీ, 16-17 పేరాలు.

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 91:11—దేవదూతలు చేసే సహాయం విషయంలో మనకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి? (wp17.5-E 5వ పేజీ)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(3 నిమి.) అనియత సాక్ష్యం. ఎదుటి వ్యక్తికి బైబిలు ఏవిధంగా సహాయం చేయగలదో తెలుసుకోండి. దానికోసం బైబిలు గురించి ప్రస్తావించకుండానే అతను దేనిగురించి ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. (lmd 1వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(4 నిమి.) అనియత సాక్ష్యం. (lmd 1వ పాఠంలో 4వ పాయింట్‌)

6. ప్రసంగం

(5 నిమి.) lmd అనుబంధం A 5వ పాయింట్‌—అంశం: మీరు ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించవచ్చు. (th 14వ అధ్యాయం)

మన క్రైస్తవ జీవితం

పాట 158

7. దేవుడు చూపిస్తున్న ఓర్పును విలువైనదిగా చూడండి—సమయాన్ని యెహోవా చూసే విధానం

(5 నిమి.) చర్చ.

వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి:

  • సమయాన్ని యెహోవా ఎలా చూస్తాడో ఆలోచించడం, ఆయన వాగ్దానాలు నెరవేరేంతవరకు ఓపిగ్గా ఎదురుచూడడానికి మనకు ఏవిధంగా సహాయం చేస్తుంది?

8. సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు—సెప్టెంబరు నెల వీడియో

9. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 68, ప్రార్థన