యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యం ఇచ్చాడు
యేసు అనియత సాక్ష్యం ఇచ్చేలా ఆయనకు ఏది తోడ్పడింది?
-
4:7—రాజ్యం గురించి మాట్లాడే బదులు, లేదా తానే మెస్సీయనని చెప్పే బదులు ఆయన తాగడానికి నీళ్లు అడగడం ద్వారా సంభాషణ మొదలుపెట్టాడు
-
4:9—ఆమె జాతిని బట్టి ఆయన ముందుగానే సమరయ స్త్రీ గురించి ఒక అభిప్రాయానికి రాలేదు
-
4:9, 12—ఆమె చాలా వివాదాస్పదమైన విషయాలను లేవనెత్తినా, ఆయన సంభాషణను పక్కకు మళ్లనివ్వలేదు.—cf-E 77వ పేజీ, 3వ పేరా
-
4:10—ఆ స్త్రీ రోజువారీ జీవితం నుండి ఒక ఉదాహరణ తీసుకుని ఆయన సంభాషణ ప్రారంభించాడు
-
4:16-19—ఆమె అనైతికంగా జీవిస్తున్నా యేసు ఆమెతో గౌరవంగా వ్యవహరించాడు
అనియత సాక్ష్యం ఇవ్వడం ప్రాముఖ్యమని ఈ వృత్తాంతం ద్వారా ఎలా తెలుసుకోవచ్చు