కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 5-6

సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి

సరైన ఉద్దేశంతో యేసును అనుసరించండి

6:9-11, 25-27, 54, 66-69

యేసు, తన శిష్యులు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్పాడు. అప్పుడు కొంతమంది అభ్యంతరపడి ఆయనను అనుసరించడం మానేశారు. దీనికి ఒక్కరోజు ముందే యేసు వాళ్లకు అద్భుతరీతిలో ఆహారం పెట్టాడు. అలా ఆయనకు ఆ శక్తి దేవుని నుండి వచ్చిందని చూపించాడు. మరి అలాంటప్పుడు వాళ్లు ఎందుకు అభ్యంతరపడ్డారు? ఎందుకంటే వాళ్లు స్వార్థంతో యేసును వెంబడించారు. వస్తుసంపదల కోసమే వాళ్లు యేసు దగ్గరికి వస్తూ ఉన్నారు.

మనలో ప్రతీఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను యేసును ఎందుకు అనుసరిస్తున్నాను? ముఖ్యంగా ఇప్పుడు, భవిష్యత్తులో వచ్చే ఆశీర్వాదాల కోసమే ఆయన్ని అనుసరిస్తున్నానా? లేదా నేను యెహోవాను ప్రేమిస్తున్నాను, ఆయన్ని సంతోషపెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి అలా చేస్తున్నానా?’

ముఖ్యంగా కింద చెప్పిన కారణాలను బట్టే యెహోవాను సేవిస్తుంటే, మనం ఎందుకు అభ్యంతర పడవచ్చు?

  • దేవుని ప్రజలతో కలిసి ఉండడం బాగుంటుంది

  • మనం పరదైసులో జీవించాలని కోరుకుంటున్నాం