కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి

క్రీస్తులాంటి వినయాన్ని, అణకువను చూపించండి

జీవించిన వాళ్లందరిలో కల్లా యేసే గొప్పవాడు, అయినా ఆయన యెహోవాను ఘనపర్చడం ద్వారా అణకువను, వినయాన్ని చూపించాడు. (యోహా 7:16-18) కానీ సాతాను దుష్టుడిగా మారాడు అంటే “అపవాది” అయ్యాడు. (యోహా 8:44) పరిసయ్యులు కూడా సాతాను స్వభావాన్ని చూపించారు. వాళ్లు గర్వంతో మెస్సీయ మీద విశ్వాసం ఉంచిన వాళ్లను చిన్నచూపు చూశారు. (యోహా 7:45-49) మనకు సంఘంలో సేవావకాశాలు, బాధ్యతలు వచ్చినప్పుడు యేసును ఎలా అనుకరించగలం?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— మత్సరపడకండి, డంబంగా ప్రవర్తించకండి, 1వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • అఖిల్‌ గర్వం ఎలా చూపించాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— మత్సరపడకండి, డంబంగా ప్రవర్తించకండి, 2వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • అఖిల్‌ వినయాన్ని ఎలా చూపించాడు?

    భరత్‌, కమల్‌లను అఖిల్‌ ఎలా ప్రోత్సహించాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— గర్వాన్ని, అమర్యాద ప్రవర్తనను విడిచిపెట్టండి, 1వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • బ్రదర్‌ హర్ష అణకువను చూపించడంలో ఎలా విఫలమయ్యాడు?

‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’​— గర్వాన్ని, అమర్యాద ప్రవర్తనను విడిచిపెట్టండి, 2వ భాగం అనే వీడియో చూసి, ఈ విషయాలను చర్చించండి:

  • బ్రదర్‌ హర్ష అణకువను ఎలా చూపించాడు?

    బ్రదర్‌ హర్ష ఉదాహరణ కావ్యకు ఏమి నేర్పించింది?