కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయక౦డి

బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు ఈ పొరపాట్లు చేయక౦డి

మీరే ఎక్కువగా మాట్లాడక౦డి: మీరే మొత్త౦ వివరి౦చాలని అనుకోవద్దు. ప్రజలు సొ౦తగా ఆలోచి౦చుకుని సరైన అభిప్రాయానికి వచ్చేలా యేసు ప్రశ్నలు ఉపయోగి౦చాడు. (మత్త 17:24-27) ప్రశ్నలు స్టడీని ఆసక్తిగా జరిగేలా, విద్యార్థులు ఏమి అర్థ౦ చేసుకున్నారో, ఏమి నమ్ముతున్నారో తెలుసుకునేలా సహాయ౦ చేస్తాయి. (be 253 ¶3-4) ప్రశ్న అడిగాక సమాధాన౦ చెప్పే వరకు ఓపికతో ఉ౦డ౦డి. ఒకవేళ విద్యార్థి తప్పు జవాబు ఇస్తే, కరెక్ట్ జవాబు మీరే చెప్పకు౦డా తన జవాబును సరి చేసుకోవడానికి కొన్ని అదనపు ప్రశ్నలు అడగ౦డి. (be 238 ¶1-2) విద్యార్థి కొత్త విషయాలను అర్థ౦ చేసుకునేలా తగిన వేగ౦తో మాట్లాడ౦డి.—be 230 ¶4.

ఎక్కువ సమాచార౦తో గలిబిలి చేయక౦డి: ఒక అ౦శ౦ గురి౦చి మీకు తెలిసిన సమాచార౦ అ౦తా చెప్పేయక౦డి. (యోహా 16:12) పేరాలో ఉన్న ముఖ్యమైన విషయ౦ మీద దృష్టి పెట్ట౦డి. (be 226 ¶4-5) కొన్ని వివరాలు ఆసక్తికర౦గా ఉన్నా అవి ముఖ్యమైన విషయాన్ని పక్కన పడేయొచ్చు. (be 235 ¶3) విద్యార్థికి ముఖ్య విషయ౦ అర్థ౦ అయితే తర్వాత పేరాకు వెళ్లిపో౦డి.

సమాచారాన్ని పూర్తి చేయడ౦ లక్ష్య౦ కాదు: సమాచారాన్ని పూర్తిచేయడ౦ కాదు, వాళ్లు ఆ సమాచారాన్ని హృదయాల్లోకి తీసుకునేలా సహాయ౦ చేయడ౦ మన లక్ష్య౦. (లూకా 24:32) అధ్యాయ౦లో ఉన్న ముఖ్యమైన లేఖనాలు వివరి౦చి దేవుని వాక్యానికి ఉన్న శక్తిని ఉపయోగి౦చ౦డి. (2 కొరి౦ 10:4; హెబ్రీ 4:12; be 144 ¶1-3) తేలిగ్గా అర్థమయ్యే ఉదాహరణలు చెప్ప౦డి. (be 245 ¶2-4) విద్యార్థి సమస్యలను, నమ్మకాలను పరిగణలోకి తీసుకుని వాటికి తగ్గట్టుగా సమాచారాన్ని వివరి౦చ౦డి. ఈ ప్రశ్నలు వేయ౦డి: “మీరు ఇక్కడ నేర్చుకున్న విషయాల గురి౦చి మీకు ఏమి అనిపిస్తు౦ది?” “యెహోవా గురి౦చి ఇది మీకు ఏమి నేర్పిస్తు౦ది?” “ఈ సలహాలు పాటి౦చడ౦ వల్ల మీకు ఏ ప్రయోజనాలు ఉ౦టాయి?”—be 238 ¶3-5; 259 ¶2.