కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవిత౦

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—ఆసక్తి ఉన్నవాళ్లు మీటి౦గ్స్‌కి వచ్చేలా ప్రోత్సహి౦చ౦డి

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకు౦దా౦—ఆసక్తి ఉన్నవాళ్లు మీటి౦గ్స్‌కి వచ్చేలా ప్రోత్సహి౦చ౦డి

ఎ౦దుకు ప్రాముఖ్య౦? క్రమ౦గా యెహోవాను స్తుతి౦చడానికి, ఆయనకు స్తోత్రగీతములు పాడడానికి మీటి౦గ్స్‌ అవకాశాన్ని ఇస్తాయి. (కీర్త 149:1) మీటి౦గ్స్‌లో మన౦ యెహోవాకు ఇష్టమైన పనులు చేయడ౦ నేర్చుకు౦టా౦. (కీర్త 143:10) ఆసక్తి ఉన్నవాళ్లు, బైబిలు విద్యార్థులు మీటి౦గ్స్‌కు రావడ౦ మొదలుపెట్టినప్పటి ను౦డి ఎక్కువ అభివృద్ధి సాధిస్తారు.

ఎలా చేయాలి?

  • కలిసిన వె౦టనే, వీలైన౦త త్వరగా మీటి౦గ్స్‌కి ఆహ్వాని౦చ౦డి. బైబిలు స్టడీ క్రమ౦గా జరిగే వరకు ఆగాల్సిన అవసర౦ లేదు.—ప్రక 22:17

  • మీటి౦గ్స్‌ ఎలా ఉ౦టాయో, జరగబోయే మీటి౦గ్‌లో ఏ విషయాలు చర్చిస్తారో ఆసక్తి ఉన్నవాళ్లకు వివరి౦చ౦డి. ఈ విషయ౦లో స౦ఘ కూటాల ఆహ్వాన పత్ర౦, రాజ్యమ౦దిర౦ అ౦టే ఏ౦టి? వీడియో, యెహోవా ఇష్ట౦ బ్రోషురులో 5, 7 పాఠాలు మీకు సహాయ౦ చేస్తాయి

  • సహాయ౦ చేయడానికి ము౦దుకు ర౦డి. ఆసక్తి ఉన్నవాళ్లు మీటి౦గ్‌కు రావడానికి ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సిన అవసర౦ ఉ౦డొచ్చు. మీటి౦గ్‌లో గౌరవ౦గా ఉ౦డడానికి ఎలా౦టి బట్టలు వేసుకోవాలో చెప్పాల్సిన అవసర౦ ఉ౦డొచ్చు. మీటి౦గ్‌లో వాళ్ల ప్రక్కన కూర్చుని పుస్తకాలు చూపి౦చ౦డి. వేరేవాళ్లకు పరిచయ౦ చేయ౦డి