మన క్రైస్తవ జీవితం
“దేవుడు ఒకటి చేసినవాళ్లను . . . ”
మోషే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు తీసుకోవాలని అనుకునే అతను చట్టబద్ధమైన సర్టిఫికెట్‌ను సిద్ధం చేసుకోవాలి. ఈ ఏర్పాటు తొందరపడి విడిపోకుండా సహాయం చేసేది. కానీ, యేసు కాలంలో మతనాయకులు విడాకులు తీసుకోవడాన్ని చాలా సులువు చేశారు. ఏ కారణంతో అయినా భర్తలు భార్యలకు విడాకులు ఇవ్వవచ్చు. (మార్కు 10:4, 11; nwtsty స్టడీ నోట్స్) వివాహాన్ని యెహోవా స్థాపించాడని, వివాహం మీద ఆయనకు పూర్తి అధికారం ఉందని యేసు వివరించాడు. (మార్కు 10:2-12) భర్త, భార్య ఇద్దరూ ఎప్పటికీ కలిసి ఉండేలా ‘ఒక్క శరీరంగా’ అవ్వాలి. ఇదే సమాచారాన్ని మత్తయి కూడా రాస్తూ విడాకులు తీసుకోవడానికి ఒకే ఒక్క లేఖనాధార ఆధారం, వ్యభిచారం అని చెప్పాడు.—మత్త 19:9.
ఈ రోజుల్లో చాలామంది వివాహాన్ని యేసు చూసినట్లు చూడకుండా, పరిసయ్యులు చూసినట్లు చూస్తున్నారు. సమస్యలు రాగానే, లోకంలో ఉన్నవాళ్లు విడాకులు తీసుకోవడానికి తొందర పడతారు. కానీ క్రైస్తవ దంపతులు వివాహంలో చేసిన ప్రమాణాలను చాలా ముఖ్యమైనవిగా తీసుకుంటారు, బైబిలు సూత్రాలను పాటిస్తూ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ, గౌరవం కుటుంబాలను కలుపుతాయి అనే వీడియో చూశాక, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:
-
మీ వివాహంలో సామెతలు 15:1 ని ఎలా పాటిస్తారు? అది ఎందుకు ప్రాముఖ్యం?
-
సామెతలు 19:11 వ వచనాన్ని పాటించడం ద్వారా ఎలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు?
-
మీ పెళ్లి విచ్ఛిన్నం అయ్యే స్థితిలో ఉంటే ‘నేను విడాకులు తీసుకోవాలా?’ అని ఆలోచించే బదులు, ఏ ప్రశ్నలు గురించి ఆలోచించాలి?
-
మత్తయి 7:12 వచనాన్ని పాటిస్తూ మీరు మంచి భర్తగా, భార్యగా ఎలా ఉండవచ్చు?