కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 9-10

విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం

విశ్వాసాన్ని బలపర్చే ఒక దర్శనం

9:1-7

యేసు రూపాంతరం అయిన దర్శనంలో తన ఆమోదం యేసుకు ఉందని ఆయన పరలోక తండ్రి ప్రకటించాడు. అప్పుడు యేసుకు ఎలా అనిపించి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. యేసు ఎదుర్కోబోయే శ్రమలకు ఖచ్చితంగా ఇది కావాల్సిన బలాన్ని ఇచ్చి ఉంటుంది. ఈ దర్శనం పేతురు, యాకోబు, యోహానుల మీద కూడా ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపించి ఉంటుంది. యేసే మెస్సీయ. వాళ్లు ఆయన మాటకు ఖచ్చితంగా లోబడాలి. దాదాపు 32 సంవత్సరాల తర్వాత, పేతురు ఆ అనుభవాన్ని, అది “ప్రవచన వాక్యం మీద” తన నమ్మకాన్ని ఎంతగా పెంచింది అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.—2 పేతు 1:16-19.

అలాంటి గొప్ప దర్శనాన్ని మనం చూడకపోయినా, ఆ దర్శనానికున్న నెరవేర్పును ఇప్పుడు చూస్తున్నాం. యేసు శక్తివంతమైన రాజుగా పరిపాలిస్తున్నాడు. త్వరలో, ఆయన “తన విజయాన్ని పూర్తి” చేసి, నీతి నిండిన కొత్త లోకానికి దారి తెరుస్తాడు.—ప్రక 6:2.

బైబిలు ప్రవచన నెరవేర్పు చూడడం వల్ల మీ విశ్వాసం ఎలా బలపడింది?