మన క్రైస్తవ జీవితం
యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు
మీరు స్కూల్లో చదువుకుంటున్నారా? మీరు యెహోవాసాక్షి అని చెప్పుకోవడానికి గానీ, సాక్ష్యం ఇవ్వడానికి గానీ మీకు ఎప్పుడైనా భయం వేసిందా? అయితే మీరు ఎలా ‘ధైర్యం కూడగట్టుకుని’ మాట్లాడవచ్చు? (1 థెస్స 2:2) మీరు ఎందుకు అలా చేయాలి? యెహోవా ధైర్యాన్ని ఇస్తాడు అనే వీడియో చూసి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
ధైర్యం తెచ్చుకోవడానికి కీర్తనకు ఏ బైబిలు ఉదాహరణ సహాయం చేసింది?
-
ఇంట్లో ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం కీర్తనకు ఎలా సహాయం చేసింది?
-
మీరు మీ స్కూల్లో వాళ్లకు ఎందుకు సాక్ష్యం ఇవ్వాలి?
-
మీరు ఇప్పుడు స్కూల్లో లేకపోయినా ఈ వీడియో నుండి ఏమి నేర్చుకున్నారు?