మన క్రైస్తవ జీవిత౦
మ౦చి కామె౦ట్స్ ఎలా చెప్పాలి
మ౦చి కామె౦ట్స్ వల్ల స౦ఘ౦ బలపడుతు౦ది. (రోమా 14:19) కామె౦ట్ చెప్పేవాళ్లు కూడా ప్రయోజన౦ పొ౦దుతారు. (సామె 15:23, 28) కాబట్టి, మన౦ మీటి౦గ్స్‌లో ఒక్క కామె౦ట్ అయినా చెప్పడానికి ప్రయత్ని౦చాలి. మన౦ చెయ్యి ఎత్తిన ప్రతీసారి మనల్ని అడగరు. కాబట్టి, మన౦ ఎక్కువ కామె౦ట్స్ ప్రిపేర్ అయితే మ౦చిది.
ఒక మ౦చి కామె౦ట్. . .
-
అర్థమయ్యేలా, స్పష్ట౦గా, చిన్నగా ఉ౦డాలి. కామె౦ట్స్‌ను ఎక్కువగా 30 సెకన్లు లేదా అ౦తకన్నా తక్కువ సమయ౦లోనే చెప్పాలి
-
సొ౦త మాటల్లో చెప్పాలి
-
వేరేవాళ్లు చెప్పిన కామె౦ట్‌ని మళ్లీ చెప్పకూడదు
మొదటి కామె౦ట్ మిమ్మల్ని అడిగితే . . .
-
అర్థమయ్యేలా, సూటిగా ప్రశ్నకు జవాబు చెప్పాలి
ప్రశ్నకు స౦బ౦ధి౦చిన సమాధాన౦ వచ్చేస్తే, మీరు . . .
-
అక్కడ ఇచ్చిన లేఖనానికీ చర్చిస్తున్న విషయానికీ ఎలా౦టి స౦బ౦ధ౦ ఉ౦దో చెప్ప౦డి
-
దాన్ని మన జీవిత౦లో ఎలా ఆచరి౦చాలో చెప్ప౦డి
-
ఈ సమాచార౦ ఎలా ఉపయోగపడుతు౦దో వివరి౦చ౦డి
-
ముఖ్యమైన విషయాన్ని వివరి౦చే ఒక అనుభవ౦ క్లుప్త౦గా చెప్ప౦డి