దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | సామెతలు 22-26
“బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము”
సామెతల పుస్తక౦లో తల్లిద౦డ్రులకు మ౦చి సలహాలు ఉన్నాయి. కొమ్మలు చిన్నగా ఉన్నప్పుడే మనకు కావాల్సినట్లుగా వ౦చుకోవాలి. తర్వాత వాటిని వ౦చలేము. అలానే, పిల్లలకు శిక్షణ ఇస్తే, పెద్దయ్యాక యెహోవా సేవ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
-
పిల్లల్ని సరిగ్గా పె౦చడానికి చాలా సమయ౦, శ్రమ తీసుకోవాలి
-
తల్లిద౦డ్రులు మ౦చి ఉదాహరణగా ఉ౦డాలి, వాళ్లు జాగ్రత్తగా నేర్పిస్తూ, సరిచేస్తూ, ప్రోత్సహిస్తూ పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వాలి
-
మనసుని, హృదయాన్ని ప్రేమగా సరి చేయడమే క్రమశిక్షణ
-
పిల్లలకు రకరకాలుగా క్రమశిక్షణ ఇవ్వాలి