కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనస్ఫూర్తిగా క్షమించాలి

మనస్ఫూర్తిగా క్షమించాలి

డౌన్‌లోడ్‌:

  1. 1. కరువైయ్యేలా కన్నీరు కూడా

    దుఃఖం పొంగింది ఇన్నాళ్లుగా.

    కాలం మళ్లీ తిరిగొస్తుందా?

    నా తప్పుందా, బలైయ్యా కదా!

    వల్లయ్యేదేనా క్షమించాలంటే!

    నాతో నేను యుద్ధం చేస్తున్నా.

    (అనుపల్లవి)

    చూస్తాడు నాలో రేగెమంటల్ని,

    యెహోవా లెక్కించాడు కన్నీలన్నీ.

    నయం చేసే వైద్యం,

    (పల్లవి)

    తానే అందిస్తాడు.

    నే, సాయం కోసం ప్రార్థిస్తా.

    అడిగా: “యెహోవా సాయం చెయ్యి,

    అంతా క్షమించేలా.”

    నేర్పిస్తాడు తానే,

    మనస్ఫూర్తిగా క్షమించే కళ.

    అడిగా: “యెహోవా సాయం చెయ్యి,

    అంతా క్షమించేలా.

    మన్నించేలా.”

  2. 2. నెట్టేస్తున్నా వెంటేవస్తాయి,

    మింగేస్తూ సమాధానాన్నే!

    నాలో మంటే ఆర్పేయాలనీ

    ఆశే ఉన్నా, కష్టంగా ఉందే!

    మన్నించేస్తే మళ్లీ తవ్వితీయం.

    అవన్ని నష్టం మాత్రమే.

    (అనుపల్లవి)

    చూస్తాడు నాలో రేగె మంటల్ని,

    యెహోవా లెక్కించాడు కన్నీలన్నీ.

    నయం చేసే వైద్యం,

    (పల్లవి)

    తానే అందిస్తాడు.

    నే, సాయం కోసం ప్రార్థిస్తా.

    అడిగా: “యెహోవా సాయం చెయ్యి,

    అంతా క్షమించేలా.”

    నేర్పిస్తాడు తానే,

    మనస్ఫూర్తిగా క్షమించే కళ.

    అడిగా: “యెహోవా సాయం చెయ్యి,

    అంతా క్షమించేలా.”

    గతాన్నంతా.

    క్షమించాలి.

    యెహోవాలా

    క్షమించాలి.