కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మళ్ళీ స్నేహం చేద్దాం!

మళ్ళీ స్నేహం చేద్దాం!
  1. 1. నాలో నేను ఇన్నాళ్లుగా

    దాచుంచానా కక్షాకోపం.

    మాటలెన్నో సూదిముళ్లై

    గాయం చేశాయ్‌.

    మన్నించటం అయ్యేపనా?

    (పల్లవి)

    మనస్సాక్షే మాట్లాడాలి.

    మనస్పర్థల్ని మరిచి,

    మనస్సుతో మన్నించాలి,

    ముందున్నట్టే మేముండాలి.

  2. 2. పొరపాటే నే చేసుంటే

    యెహోవైతే ఏం చేస్తాడు?

    మన్నించడా, క్షమించడా

    నీకే తెల్సు, జవాబేంటో

    ఏం చేయాలో ...

    (పల్లవి)

    మనస్సాక్షే మాట్లాడాలి.

    మనస్పర్థల్ని మరిచి,

    మనస్సుతో మన్నించాలి,

    ముందున్నట్టే మేముండాలి.

    (బ్రిడ్జ్‌)

    బెట్టే మానేస్తా

    మెట్టే దిగి మాట్లాడేస్తా

    గుండె గాయాలన్నీ

    మా స్నేహంతో మాన్పేస్తాలే!

  3. 3. కోరిమనం కాదంటామా?

    యెహోవాలా ప్రేమించమా

    చేయి చేయి మళ్లీ కల్పి

    సంతోషంతో సాగిపోదాం, ముందుకెళ్దాం!

    (పల్లవి)

    మనస్సాక్షే మాట్లాడాలి.

    మనస్పర్థల్ని మరిచి,

    మనస్సుతో మన్నించాలి,

    ముందున్నట్టే మేముండాలి.

    ముందున్నట్టే మేముండాలి

    క్షమించేస్తాలే!