కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

146వ పాట

మీరు నా కోసం చేశారు

మీరు నా కోసం చేశారు

(మత్తయి 25:34–40)

  1. అభిషిక్తులైన యేసు శిష్యులతో

    సేవచేస్తున్నారు వేరేగొర్రెలు.

    వాళ్లకోసం చేసే ప్రతీ మంచిపని

    తనకోసం చేసినట్టే చూస్తాడు.

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”

  2. “ఆకలేస్తే నాకు ఆహారం పెట్టారు,

    దాహమేస్తే మీరే నీళ్లు ఇచ్చారు.”

    వాళ్లంటారు యేసుతో, “ఎప్పుడు?” అని.

    దానికి యేసు జవాబిస్తాడిలా:

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”

  3. “ప్రకటిస్తూ మీరు ఈ నా సోదరుల్తో,

    ఎంతో నమ్మకంగా ఉన్నారెప్పుడూ.”

    ఆపై రాజంటాడు తన గొర్రెలతో:

    “రండి, రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.”

    (పల్లవి)

    “వాళ్లకెప్పుడైనా ఓదార్పునిస్తే,

    నన్ను కూడా మీరు ఓదార్చినట్టే.

    వాళ్ల కోసం మీరు శ్రమపడితే,

    నాకోసం కూడా శ్రమించినట్టే.

    మరువను నేను దాన్ని ఎన్నడూ.”