కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 53

ఐకమత్యంతో దేవుణ్ణి సేవిద్దాం

ఐకమత్యంతో దేవుణ్ణి సేవిద్దాం

(ఎఫెసీయులు 4:3)

1. యెహోవా మన కాపరి

మనమాయన గొర్రెలం.

దేవుని మాట ప్రకారం

శాంతితో ఉంటున్నాం.

శాంతెంతో అమూల్యం.

ఐక్యంగా ఉందాం.

క్రీస్తు ద్వారానే దేవుడు

నేడు నడిపిస్తున్నాడు.

ఆయన్ను సేవిస్తూ మనం

లోబడి ఉందాము.

2. వేడుకుంటూ ఐక్యతకై

చూపిస్తుందాము దయను.

ఎక్కువౌతుంది అప్పుడు,

ప్రేమా సంతోషము.

శాంతి సేదదీర్చి,

ఇస్తుందానందం.

సోదర ప్రేమ చూపిస్తే

పొందుతాం దైవానుగ్రహం.

దైవ సేవలో జీవితం

గడిపేద్దాం మనం.