కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 3

“దేవుడు ప్రేమాస్వరూపి”

“దేవుడు ప్రేమాస్వరూపి”

(1 యోహాను 4:7, 8)

1. యెహోవా ప్రేమాస్వరూపి, ఆయన్ననుసరిద్దాం.

జీవానికి అదే మూలం, అదేగా మన లక్ష్యం.

క్రీస్తులాంటి ప్రేమే ఉంటే, అపజయం ఉండదు.

మాటల్లో చేతలలోను, పంచుతాం ఆ ప్రేమను.

2. యెహోవాపై ప్రేమే ఉంటే, అందర్నీ ప్రేమిస్తాము.

ప్రేమెంతో పవిత్రమైంది, చూపదు మత్సరము.

సమస్తం తాళుకుంటుంది, చూపిస్తుంది దయను.

మనలో ఉంటే ఈ ప్రేమ, సంతోషం పొందుతాము.

3. మనమెన్నడూ ద్వేషించం, తావివ్వము పగకు.

ఉంటుంది దేవుని సాయం, ప్రతీ విషయంలోను.

ప్రేమంటే ఏమిటో తానే, నేర్పిస్తాడు మనకు.

ఇతరుల్ని ఆయనలా, ప్రేమిద్దాము మనము.