కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 4

దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుకుందాం

దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుకుందాం

(ప్రసంగి 7:1)

1. అనుక్షణము ఆనందంగా మనం

యెహోవా చెప్పే మాటల్ని గైకొందాం.

సరైనది చేసి సంతోషింపజేద్దాం

మంచి పేరును తెచ్చుకుందాం.

2. మునిగే నావ లాంటిదీ లోకము

ఎంత పేరున్నా అదంతా వ్యర్థము.

ఈ లోకంతో మనం చేసేటి స్నేహము

దేవునితోనే శత్రుత్వము.

3. జీవగ్రంథంలో మా పేర్లుండాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

సేవిస్తాము నిన్ను నిత్యము యెహోవా

కాపాడుకుంటాం మంచి పేరు.