కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 24

మీ దృష్టి లక్ష్యముపై ఉంచండి!

మీ దృష్టి లక్ష్యముపై ఉంచండి!

(2 కొరింథీయులు 4:18)

1. చూస్తారు మళ్లీ గ్రుడ్డివారు, చెవిటి వారంతా వింటారు.

ఉబికి నీళ్లు ఎడారుల్లో, పూస్తాయి బీళ్ళల్లో పూలు.

ఉండరు కుంటివారెవ్వరు, మరణం అనేదే ఉండదు.

మీరు ఆ కాలాన్ని చూడొచ్చు, దృష్టి లక్ష్యము పైనుంటే.

2. ఉండదు ఇక వృద్ధాప్యము, ఉండరు ఇక మూగవారు.

ఈ భూమి సమృద్ధినిస్తుంది, ఉండదు లేమి మనకు.

చేస్తారు పిల్లలు గానాలు, ఉంటాయి శాంతిసంతోషాలు.

పునరుత్థానము చూడొచ్చు, దృష్టి లక్ష్యము పైనుంటే.

3. గొర్రెలు, తోడేళ్లు మేయగా, ఆడగా ఎలుగుల్‌ ఆవులు,

బాలుడు ఔతాడు కాపరి, వింటాయి వాని మాటను.

కన్నీరు గతించిపోవును, బాధలు భయాలు ఉండవు.

దేవుని వాగ్దానం చూడొచ్చు, దృష్టి లక్ష్యము పైనుంటే.

(యెష. 11:6-9; 35:5-7; యోహా. 11:24 కూడా చూడండి.)