కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 45

ముందుకు సాగిపోదాం!

ముందుకు సాగిపోదాం!

(హెబ్రీయులు 6:1)

1. సంపూర్ణులమౌతూ సాగిపోదాము.

పరిచర్యలో పెంచుకుందాము ప్రావీణ్యం.

శక్తికై దేవుని వేడుకుంటూనే, నీతికై కృషిచేద్దాం.

యేసులానే మనం అందరం

సువార్త ప్రకటిస్తూ ఉందాం.

దేవుని గొప్ప నామాన్ని చాటిస్తే దీవెనలు పొందుతాం.

2. ధైర్యంగా ప్రకటిస్తూ సాగిపోదాం.

నిత్య సువార్త అందరికీ చాటిద్దాము.

దేవుని వర్తమానాన్ని అందిస్తూ, సత్యాన్ని బోధిద్దాము.

శత్రువులు భయపెట్టినా

వెనుతీయక ప్రకటిద్దాం.

దేవుడైన యెహోవాను స్తుతిస్తూ, ఇంటింటా ప్రకటిద్దాం.

3. కోత విస్తారంగా ఉంది కాబట్టి

మన సామర్థ్యాన్ని మరింత పెంచుకుందాం.

పరిశుద్ధాత్మకై దేవున్నర్థిస్తూ, సంతోషంతో సేవిద్దాం.

ప్రజల్ని ప్రేమతో కలుస్తూ

మనసు మారేలా బోధిద్దాం.

సత్యము వెలుగై ప్రకాశించేలా, జ్యోతుల్లా బ్రతుకుదాం.

(ఫిలి. 1:27; 3:16; హెబ్రీ. 10:39 కూడా చూడండి.)