పాట 31
మేము యెహోవాసాక్షులము!
1. చెక్కలతో రాళ్ళతో, చేస్తారు ప్రతిమల్ని.
గుర్తించరు వారు, సత్యదేవుణ్ణి.
భవిష్యత్తు ఏమిటో, ఆ దేవుళ్లెరుగరు.
సాక్షుల్లేరు వారెవ్వరికీ, చూపలేరు దైవత్వము.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
2. మా దేవుని నామాన్ని, సగర్వంగా చాటుతాం.
రాజ్య సందేశాన్ని, ధైర్యంగా చెప్తాం.
సత్యం స్వాతంత్ర్యమిచ్చు, గుర్తించాలి అందరు.
దేవుని గూర్చి నేర్చుకుని, స్తుతించాలి ఆయనను.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
3. సాక్ష్యం తీసివేస్తుంది, దేవునిపై నిందను.
దైవదూషకుల్ని, హెచ్చరించును.
దాన్ని విని మారితే, మన్నిస్తాడు దేవుడు.
ఆ పని సంతోషాన్నిస్తుంది, పొందుతాం నిత్యజీవము.
(పల్లవి)
మేం యెహోవాసాక్షులం
ప్రకటిస్తాం మానక.
మా దేవుని ప్రవచనము
నెరవేరు తప్పక.
(యెష. 37:19; 55:11; యెహె. 3:19 కూడా చూడండి.)