కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 51

యెహోవాను హత్తుకొని ఉందాం

యెహోవాను హత్తుకొని ఉందాం

(యెహోషువ 23:8)

1. యెహోవా సర్వోన్నతుణ్ణని చూపించాడు.

చేసే ప్రతీదానిలో న్యాయంగా ఉంటాడు.

ఆయన చెప్పేదేదీ కాదు నిష్ఫలం.

యెహోవానే హత్తుకొని ఉంటూ మనం,

స్వీకరిస్తే రాజుగా పొందుతాం జీవం.

2. నీతి న్యాయం ఆయన పాలనకాధారం.

మహిమాన్వితం ఆయన నివాస స్థలం.

దీనులాయనకు దగ్గరౌతున్నారు.

ఆరాధనకు యెహోవాయే అర్హుడు.

ఆయన్నే మనం హత్తుకొని ఉందాము.

3. మహాకాశాలు ఆయన్ను పట్టజాలవు

నిరోధించలేడు ఆయన్ను ఏ శత్రువు.

ఆయనిచ్చిన మాట తప్పడేనాడు.

యెహోవా వెంటే ఉంటూ చిత్తం చేద్దాము.

ఆయనపై భక్తిని పెంచుకుందాము.