కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 27

యెహోవా పక్షాన ఉండండి!

యెహోవా పక్షాన ఉండండి!

(నిర్గమకాండము 32:26)

1. కలతతోనుండె మా హృదయం,

అబద్ధమతంలో ఉన్నప్పుడు.

కానీ మా హృదయాలుప్పొంగాయి

సువార్త విన్నప్పుడు.

(పల్లవి)

యెహోవాపక్షాన ఉండండి మీరు.

ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

స్వేచ్ఛ శాంతి గూర్చి చాటి చెప్పండి.

క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.

2. మా నిండు హృదయాలతో నేడు

సేవిస్తూ సత్యము వ్యాప్తి చేస్తాం.

సహోదరులకు తోడ్పడుతూ

దైవ నామం స్తుతిస్తాం.

(పల్లవి)

యెహోవాపక్షాన ఉండండి మీరు.

ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

స్వేచ్ఛ శాంతి గూర్చి చాటి చెప్పండి.

క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.

3. అపవాదికి మేం భయపడం,

యెహోవా మాకు తోడై ఉన్నాడు.

శత్రువులు ఎంతమందివున్నా,

దేవుడే మా బలము.

(పల్లవి)

యెహోవాపక్షాన ఉండండి మీరు.

ఆయన మిమ్మల్ని ఎడబాయడు.

స్వేచ్ఛ శాంతి గూర్చి చాటి చెప్పండి.

క్రీస్తు పాలనలో వర్ధిల్లు నీతి.