కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 40

రాజ్యానికి మొదటి స్థానమివ్వండి

రాజ్యానికి మొదటి స్థానమివ్వండి

(మత్తయి 6:33)

1. ప్రశస్తం యెహోవాకెంతో

మెస్సీయ ఏలే రాజ్యం.

లోకాన్ని మార్చి తెస్తుంది

ఆయనకు ఆనందం.

(పల్లవి)

దైవ రాజ్యాన్ని, నీతిని

మొదట వెదకండి.

నమ్మకంగా సేవచేస్తూ

దేవుణ్ణి స్తుతించండి.

2. రేపటి గూర్చిన చింత

విడిచి మనమంతా

వెదికితే దైవరాజ్యం

దేవుడే ఇస్తాడంతా.

(పల్లవి)

దైవ రాజ్యాన్ని, నీతిని

మొదట వెదకండి.

నమ్మకంగా సేవచేస్తూ

దేవుణ్ణి స్తుతించండి.

3. సువార్త ప్రకటించండి

యోగ్యుల్ని కనుగొని.

నింపండి వారందరిలో

రాజ్యంపై నమ్మకాన్ని.

(పల్లవి)

దైవ రాజ్యాన్ని, నీతిని

మొదట వెదకండి.

నమ్మకంగా సేవచేస్తూ

దేవుణ్ణి స్తుతించండి.