పాట 117
యెహోవా మంచితనాన్ని ఇతరులకు పరిచయం చేయండి
-
1. ఓ యెహోవా, మంచివాడా
నీ రుణం తీర్చుకోలేం
నిన్ను మించే మంచితనం
లేనేలేదు విశ్వంలో
ప్రేమిస్తావు, క్షమిస్తావు
మా మట్టి మనుషుల్ని
స్తుతినిస్తాం, సేవచేస్తాం
ఊపిరున్నంత కాలం.
-
2. నీ జనంగా, పిల్లలంగా
చూపిస్తాం ఈ లక్షణం
మా మాటల్తో, మా పనుల్తో
తెస్తాం ఓ మంచిపేరు
ముత్యంలాంటి మంచివార్త
మోసుకెళ్తాం అంతటా
నీ శక్తితో, నీ సాయంతో
నీలా చెక్కు మమ్మల్ని.
-
3. ఏ కల్మషం లేని గుండె
దయచేసి మాకివ్వు
ఇంట్లోవాళ్లు, నలుగురు
చూడాలి మా సుగుణం
మానకుండా, మా వంతుగా
శ్రమిస్తాం ప్రతీక్షణం
మంచికే మారుపేరుగా
నిలవాలి మేం నీలా!
(కీర్త. 103:10; మార్కు 10:18; గల. 5:22; ఎఫె. 5:9 కూడా చూడండి.)